ETV Bharat / business

బ్యాంకు లావాదేవీలపై ఛార్జీలు ఎంతో తెలుసా? - డెబిట్ కార్డు ఛార్జీలు

మనలో చాలామందికి బ్యాంకు ఖాతాలున్నప్పటికీ.. ఆయా బ్యాంకులు అందించే సేవలకు ఎంత వసూలు చేస్తున్నాయో తెలుసుకునేంత సమయం ఉండకపోవచ్చు. నగదు లావాదేవీలు, ఏటీఎం ఉపసంహరణ సహా.. ఇతర సేవలకు బ్యాంకులు ఎంత వసూలు చేస్తున్నాయో తెలుసుకోండి.

ATM withdrawals and other services
బ్యాంకు ఛార్జీలు
author img

By

Published : May 23, 2021, 6:03 AM IST

బ్యాంకు ఖాతా లేని వారు ఉండటం చాలా తక్కువ. కొందరికి వేరు వేరు బ్యాంకుల్లో ఖాతాలు ఉంటాయి. అయితే.. దానికి సంబంధించిన సేవలను బ్యాంకులు ఉచితంగా అందించవని మనలో చాలామందికి తెలియకపోవచ్చు. దేశంలోని ప్రధాన బ్యాంకులు.. ఆయా సేవలకు విధించే ఛార్జీలు ఎలా ఉన్నాయో ఒకసారి పరిశీలిద్దాం..

  • నగదు లావాదేవీలు: ఒక నెలలో బ్యాంకు ద్వారా చేసే మూడు లేదా ఐదు నగదు లావాదేవీలకు ఎటువంటి ఛార్జీలు విధించవు. తరువాత జరిగే లావాదేవీలకు మాత్రం ఆయా బ్యాంకులు రుసుములు వసూలు చేస్తాయి.
  • ఏటీఎం ఉపసంహరణలు: ఆయా బ్యాంకుల ఏటీఎంలలో నెలకు గరిష్ఠంగా ఐదు, ఇతర బ్యాంకులకు సంబంధించి మూడు లావాదేవీలను ఉచితంగా అందిస్తున్నాయి. సొంత బ్యాంకు ఏటీఎంల నుంచి ఐదు, ఇతర బ్యాంకుల నుంచి మూడు లావాదేవీలు దాటితే విధించే ఛార్జీలు బ్యాంకును బట్టి మారుతూ ఉంటాయి. ఉదాహరణకు.. ఎస్​బీఐ, ఐసీఐసీఐ బ్యాంకులు.. మెట్రో నగరాల్లో ఎనిమిది లావాదేవీలు దాటితే.. రూ.20 నుంచి రూ.50 వరకు ఛార్జీలు వసూలు చేస్తున్నాయి.
  • ఐఎంపీఎస్ నగదు బదిలీ: భారతీయ బ్యాంకులన్నీ నెఫ్ట్, ఆర్​టీజీఎస్​ సేవలను ఉచితంగా అందిస్తున్నప్పటికీ.. తక్షణ చెల్లింపు కోసం ఐఎంపీఎస్ ఛార్జీలు వసూలు చేస్తాయి. సాధారణంగా ఇది రూ.1 నుంచి 25 రూపాయల వరకు ఉండొచ్చు.
  • ఏటీఎం లావాదేవీ విఫలమైతే: ఏటీఎం ద్వారా జరిపే లావాదేవీలు విఫలమైతే.. ఎటువంటి ఛార్జీలు వసూలు చేయొద్దని ఆర్​బీఐ.. బ్యాంకులకు సూచించింది. ఖాతాలో తగినంత బ్యాలెన్స్ లేని సందర్భాల్లో లావాదేవి విఫలమైతే బ్యాంకులు రుసుము వసూలు చేస్తాయి. ఎస్​బీఐ రూ.20తో పాటు జీఎస్​టీని వసూలు చేస్తుండగా.. హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ, కోటక్ మహీంద్రా, యెస్​ బ్యాంక్ ఫెయిల్​ అయిన లావాదేవీలకు రూ.25 వసూలు చేస్తున్నాయి.
  • కనీస బ్యాలెన్స్: పొదుపు ఖాతాలో కనీస బ్యాలెన్స్ ఉండాలి. లేదంటే 100రూపాయలతో పాటు.. కనీస బ్యాలెన్స్​ విలువలో 5 శాతాన్ని జరిమానాగా విధిస్తాయి బ్యాంకులు. ఐసీఐసీఐ బ్యాంక్ నగరాలు, పట్టణ శాఖల్లో కనీస బ్యాలెన్స్​ని రూ.10,000గా.. సెమీ అర్బన్, గ్రామీణ శాఖల్లో రూ.5,000 తప్పనిసరి చేసింది.
  • డాక్యుమెంటేషన్: వివిధ పత్రాల జారీకి బ్యాంకులు కొంత రుసుమును వసూలు చేస్తాయి. ఉదాహరణకు.. సంతకం ధ్రువీకరణ కోసం ఎస్​బీఐ రూ.150 వసూలు చేస్తోంది. ఆర్థిక సంవత్సరానికి ఒకసారి బ్యాంకులు వార్షిక ఖాతా స్టేట్‌మెంట్‌ను అందిస్తాయి. ఇక డూప్లికేట్ అకౌంట్ స్టేట్‌మెంట్‌ కోసం రూ.50 నుంచి రూ.100 వరకు ఛార్జి చేస్తాయి. ఈ సేవకు ఐసీఐసీఐ రూ.100 వసూలు చేస్తుంది.
  • డెబిట్ కార్డు ఛార్జీలు: డెబిట్ కార్డు పోగొట్టుకున్నట్లయితే.. కొత్త కార్డు జారీ చేసేందుకు రూ.50-రూ.500 వరకు వసూలు చేస్తున్నాయి బ్యాంకులు. ఇక ఏటీఎం పిన్​ను మార్చుకున్న(రీసెట్) ప్రతిసారీ ఛార్జీలు విధించే అవకాశం లేకపోలేదు.
  • ఎస్ఎంఎస్ ఛార్జీలు: మన ఖాతాల ద్వారా జరిగే లావాదేవీల సమాచారం ఎప్పటికప్పుడు ఎస్ఎంఎస్​ల ద్వారా తెలియజేస్తుంటాయి బ్యాంకులు. వివిధ హెచ్చరికలు, మోసాలను గుర్తించేందుకు ఈ సేవ ముఖ్యమైనది. అయితే.. వీటిని ఎప్పటికప్పుడు మారుస్తూంటాయి. ఉదాహరణకు.. యాక్సిస్​ బ్యాంకు ఈ ఛార్జీలను ఈ మధ్యే సవరించింది. ప్రతి నెలా రూ.5 వసూలుకు బదులు.. ప్రతీ ఎస్ఎంఎస్​కు(ఓటీపీలు, ప్రచార సందేశాలు మినహా) 25 పైసలు వసూలు చేస్తుంది.
  • చెక్కుల సేవలు: ఆర్​బీఐ మార్గదర్శకాల ప్రకారం.. లక్ష రూపాయల విలువైన చెక్కులను పాస్​ చేసేందుకు రూ.150 కంటే ఎక్కువ వసూలు చేయడానికి వీలులేదు. ఇక చెక్ బౌన్స్ అయితే రూ.100-150 రుసుము చెల్లించాల్సి ఉంటుంది.

ఇదీ చదవండి: వచ్చే నెల 'బ్యాడ్​ బ్యాంక్' షురూ!

ఇదీ చదవండి: ప్రభుత్వ ఖాతాలపై బ్యాంకులకు ఆర్​బీఐ కీలక ఆదేశాలు

ఇవీ చదవండి: కరోనాతో 1300మంది బ్యాంకు ఉద్యోగులు మృతి

ఐసీఐసీఐ బ్యాంక్​కు రూ.3 కోట్లు జరిమానా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.