ETV Bharat / business

శానిటైజర్​పై 18% జీఎస్​టీ తప్పదు- కారణమిదే... - sanitisers GST rate

హ్యాండ్ శానిటైజర్లు 18 శాతం జీఎస్​టీ స్లాబ్​ పరిధిలోకి వస్తాయని కేంద్రం స్పష్టం చేసింది. వీటి తయారీలో ఉపయోగించే రసాయనాలు, ఇతర వస్తువులకు సైతం ఇదే రేటు వర్తిస్తుందని పేర్కొంది.

Alcohol-based hand sanitisers to attract GST at the rate of 18 per cent
డెటాల్​ మాదిరిగానే శానిటైజర్​పై కూడా 18 శాతం జీఎస్​టీ
author img

By

Published : Jul 15, 2020, 7:01 PM IST

సబ్బులు, యాంటీ బ్యాక్టీరియా లిక్విడ్​ల తరహాలో శానిటైజర్లు సైతం 18 శాతం జీఎస్​టీ పరిధిలోకి వస్తాయని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.

హ్యాండ్ శానిటైజర్ల తయారీలో ఉపయోగించే రసాయనాలు, ప్యాకింగ్ మెటీరియల్స్​ సహా ఇతర వస్తువులకు 18 శాతం జీఎస్​టీ వర్తిస్తుందని వెల్లడించింది.

"శానిటైజర్లు, సబ్బులు, యాంటీ బాక్టీరియల్ ద్రావణాలు, డెటాల్ మొదలైన క్రిమిసంహారక మందులన్నీ 18 శాతం జీఎస్​టీ రేటు పరిధిలో ఉంటాయి."

-కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటన

శానిటైజర్లపై జీఎస్​టీ తగ్గించడం వల్ల దేశీయ తయారీదారులతో పాటు దిగుమతిదారులపై ప్రతికూల ప్రభావం పడుతుందని ఆర్థిక శాఖ పేర్కొంది. జీఎస్​టీ రేట్లు తక్కువగా ఉంటే విదేశాల నుంచి దిగుమతులు పెరుగుతాయని... ఇది 'ఆత్మనిర్భర్ భారత్​' విధానానికి వ్యతిరేకమని వివరించింది.

ఆల్కహాల్ ఆధారిత శానిటైజర్లు 18 శాతం స్లాబులోకి వస్తుందని అథారిటీ అడ్వాన్స్​ రూలింగ్(ఏఏఆర్)​ గోవా బెంచ్​ సైతం ఇటీవల స్పష్టం చేసింది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.