ETV Bharat / business

5 ఏళ్లలో రూ. 1.17 లక్షల కోట్లు.. ఎయిర్​టెల్ మెగా ప్లాన్

Airtel to invest Rs 1.17 lakh crore: ఎయిర్​టెల్​ వచ్చే ఐదేళ్లలో రూ. 1.17 లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టనుంది. ఎయిర్​టెల్ అనుబంధ సంస్థలైన ఇండస్‌ టవర్స్‌, ఎన్‌ఎక్స్‌ట్రా, భారతీ హెక్సాకామ్‌తో ఆ మేరకు వ్యాపార లావాదేవీలను నిర్వహించనున్నట్లు ఎయిర్​టెల్ పేర్కొంది.

author img

By

Published : Feb 6, 2022, 7:01 PM IST

airtel
ఎయిర్​టెల్​

Airtel to invest Rs 1.17 lakh crore: ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్‌టెల్‌ రాబోయే ఐదేళ్లలో రూ. 1.17 లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైంది. తన అనుబంధ సంస్థలైన ఇండస్‌ టవర్స్‌, ఎన్‌ఎక్స్‌ట్రా , భారతీ హెక్సాకామ్‌తో ఆ మేరకు వ్యాపార లావాదేవీలను నిర్వహించనున్నట్లు రెగ్యులేటరీ ఫైలింగ్‌లో ఎయిర్‌టెల్‌ పేర్కొంది. మరోవైపు ఫిబ్రవరి 26న ఎయిర్‌టెల్‌ బోర్డు అసాధారణ సమావేశం (ఈజీఎం) కానుంది.

ఇటీవల రూ. 7,500 కోట్లకు కంపెనీలో 1.25 శాతం వాటాలను గూగుల్‌కు విక్రయించిన సంగతి తెలిసిందే. ఈ లావాదేవీకి బోర్డు ఆమోదం పొందడం కోసం ఈ సమావేశం నిర్వహిస్తోంది.

ఈజీఎం నోటీసు ప్రకారం.. రాబోయే ఐదేళ్లలో వెచ్చించబోయే మొత్తంలో ఒక్క ఇండస్‌ టవర్స్‌ కోసం రూ. 88వేల కోట్లు ఎయిర్‌టెల్‌ ఖర్చు చేయనుంది. డేటా సెంటర్‌ సంస్థ అయిన ఎన్‌ఎక్స్‌ట్రా నుంచి సేవలకు గానూ రూ.15 వేల కోట్లు, భారతీ హెక్సాకామ్‌తో లావాదేవీలకు రూ.14వేల కోట్లు ఖర్చు పెట్టనుంది. ఈ మూడింట్లో టవర్స్‌పైనే ఎక్కువ మొత్తం ఎయిర్‌టెల్‌ వెచ్చించనుంది.

ప్రస్తుతం 5జీ సేవలు ప్రపంచవ్యాప్తంగా ప్రారంభమవుతున్నాయని, భారత్‌లోనూ త్వరలోనే ఆ కల సాకారం కానుందని ఎయిర్‌టెల్‌ తన ఈజీఎం నోటీసులో పేర్కొంది. ఇందులో భాగంగా తొలుత నగరాల్లోనూ, ఆపై దేశవ్యాప్తంగా తమ నెట్‌వర్క్‌ను విస్తరించాలని ఎయిర్‌టెల్‌ లక్ష్యంగా నిర్దేశించుకుంది.

ఇందులో భాగంగా 5జీకి కావాల్సిన మౌలిక వసతులను సమకూర్చుకోవడం కోసం ఏడాదికి దాదాపు రూ. 20వేల కోట్లు చొప్పున 2025-26 వరకు ఖర్చు చేయబోతున్నట్లు ఎయిర్‌టెల్‌ ఆ నోటీసులో పేర్కొంది.

ఇదీ చూడండి: డిజిటల్ రూపీకి, పేటీఎంకు తేడా ఏంటి? ఏది బెటర్?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.