ఎయిర్ బ్యాగుల్లో లోపాలతో టెస్లా, బీఎమ్‌డబ్ల్యూ, ఫోక్స్‌వాగన్, సుబారు, మెర్సిడస్, ఫెరారీ, డయామ్లర్ వ్యాన్స్ లాంటి కంపెనీలు దాదాపు 17 లక్షల కార్లను వెనక్కి పిలిపిస్తున్నాయి.
వీటన్నింటినిలోని ఎయిర్‌బ్యాగులను జపాన్‌కు చెందిన టకాటా కార్ప్ తయారు చేసింది. ఎయిర్బ్యాగులలో ఉపయోగించిన అమోనియం నైట్రేట్... తేమశాతం వల్ల కొద్ది కాలం తరవాత ప్రభావం చూపించటం లేదు. ఒక్కోసారి తీవ్రస్థాయిలో పేలుడు జరుగుతోంది. ఫలితంగా పదునైన వస్తువులు డ్రైవర్లు, ప్రయాణికులకు బలంగా తగులుతున్నాయి. ఇలా ఎయిర్‌బ్యాగు లోపాల వల్ల ప్రపంచవ్యాప్తంగా కనీసం 23 మంది చనిపోయారు. వందల మంది గాయపడ్డారు.
శుక్రవారం నాడు అమెరికా ప్రభుత్వం వాహనాలు తిరిగి పిలిపించటాన్ని ప్రకటించింది. ఇది ఆ దేశ చరిత్రలో అతిపెద్ద రీకాల్ కావటం విశేషం. ఇప్పటి వరకు కోటి ఎయిర్‌బ్యాగులు మార్చే లక్ష్యంతో వాహనాలను వెనక్కి పిలిపించారు. వచ్చే సంవత్సరం చివరినాటికి మొత్తం 7కోట్ల ఎయిర్‌బ్యాగులు సరిచేయాల్సి ఉంది.
కంపెనీ | సంఖ్య | తయారీ సంవత్సరం |
సుబారు | 8,26,144 | 2010-14 |
మెర్సిడస్ | 2,88,779 | 2010-17 |
ఫోక్స్‌వాగన్ | 1,19,394 | 2015-17 |
బీఎమ్‌డబ్ల్యూ | 2,66,044 | 2000-04, 2007-15 |
డయామ్లర్ వ్యాన్స్ | 1,59,689 | 2015-17 |
టెస్లా | 68,763 | 2014-16 |
ఫెరారీ | 11176 | 2014-18 |
గతేడాది డిసెంబర్ నాటికి మొత్తం వేర్వేరు సంస్థలు 2.72కోట్ల ఎయిర్‌బ్యాగులు మార్చాయి. మరో 2.3 కోట్ల ఎయిర్ బ్యాగులు సరిచేయాల్సి ఉంది.