ETV Bharat / business

విమాన ప్రయాణం మరింత భారం

విమాన ప్రయాణం ఇకపై మరింత భారంగా మారనుంది. దేశీయ విమాన ఛార్జీలను పెంచాలని ప్రభుత్వం నిర్ణయించడమే ఇందుకు కారణం. కేంద్రం తాజా ప్రకటన ప్రకారం విమాన ఛార్జీలు ప్రయాణ సమయం ఆధారంగా 10-30 శాతం వరకు పెరగనున్నాయి.

Air travel becomes expensive
విమాన ఛార్జీల పెంపునకు కేంద్రం ఆదేశం
author img

By

Published : Feb 12, 2021, 10:20 AM IST

ఇకపై దేశీయ విమాన ప్రయాణికులపై భారం పడనుంది. విమాన ఛార్జీల కనిష్ఠ, గరిష్ఠ పరిమితులను 10-30 శాతం వరకు పెంచుతున్నట్లు.. పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ప్రకటించడమే ఇందుకు కారణం. ఈ కొత్త పరిమితులు ఈ ఏడాది మార్చి 31 లేదా తదుపరి ఆదేశాలు వచ్చేంతవరకు అమల్లో ఉంటాయి.

ఏవియేషన్ మార్కెట్ పూర్తి స్థాయిలో కార్యకలాపాలు సాగించేందుకు ఛార్జీల పెంపు తప్పనిసరి అని పౌరవిమానయాన మంత్రిత్వ శాఖ పేర్కొంది. అయితే పెరుగుతున్న ఇంధన ధరలు కూడా ఇందుకు కారణమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

కొవిడ్‌ లాక్‌డౌన్‌ అనంతరం 2020 మే 25న దేశీయ విమానాలను పునః ప్రారంభించిన సమయంలో ప్రయాణ సమయాన్ని ఆధారంగా ఏడు శ్రేణుల్లో పరిమితులు విధించారు. కనిష్ఠ, గరిష్ఠ పరిమితుల సగటు ధర కంటే తక్కువకే దాదాపు 40 శాతం టికెట్లు విక్రయించాల్సి ఉంటుంది.

సర్వీసులపై పరిమితి

విమానయాన సంస్థల సామర్థ్యంలో 80 శాతం సర్వీసులనే ఈ ఏడాది మార్చి 31వరకు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. తొలుత ఇది 33 శాతంగా ఉండగా, గత ఏడాది జూన్‌ 26న ఆ పరిమితిని 45 శాతానికి; సెప్టెంబరు 2న 60 శాతానికి; నవంబరు 11న 70 శాతానికి; డిసెంబరు 3న 80 శాతానికి పెంచారు.

New fares chart
కొత్త ఛార్జీలు ఇలా

ఇదీ చదవండి:పెట్రో బాదుడు.. వరుసగా నాలుగోరోజు పెరిగిన ధరలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.