ETV Bharat / business

భారత్​కు ఏడీబీ రూ.11,400 కోట్ల సాయం - latest business news

కరోనా మహమ్మారిపై పోరుకు భారత్‌కు 1.5 బిలియన్‌ డాలర్ల రుణం మంజూరు చేసింది ఏసియన్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంకు (ఏడీబీ). కరోనా నివారణ చర్యలు, పేదలకు సాయం అందించేందుకు ఈ నిధులు ఇస్తున్నట్టు తెలిపింది.

ADB approves USD 1.5 billion loan to India
భారత్​కు ఏడీబీ రూ.11,400కోట్ల సాయం
author img

By

Published : Apr 28, 2020, 5:25 PM IST

భారత్​లో కరోనా వైరస్​ను కట్టడి చేసేందుకు 1.5 బిలియన్​ డాలర్లను(రూ.11,400కోట్లు) ఆర్థిక సాయంగా అందించేందుకు ఆమోదం తెలిపింది ఏసియన్​ డెవలప్​మెంట్​ బ్యాంకు(ఏడీబీ). కరోనా నియంత్రణ చర్యలు, పేదలు, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి అండగా ఉండాలనే ఈ నిధులను మంజూరు చేసినట్లు తెలిపింది.

కష్టకాలంలో భారత్​కు అన్ని విధాలా అండగా ఉండేందుకు కట్టుబడి ఉన్నట్లు ఏడీబీ అధ్యక్షుడు మసాత్సుగు అసకావా చెప్పారు. ప్రభుత్వం, అభివృద్ధి భాగస్వాములకు సహకారం అందించే భారీ ప్యాకేజీలో భాగంగానే ఈ నిధులను తక్షణమే మంజూరు చేసినట్లు వివరించారు.

ఫిలిప్పీన్స్​ రాజధాని మనీలా కేంద్రంగా ఉన్న ఏడీబీ, కోవిడ్​-19 యాక్టివ్​ రెస్పాన్స్​ అండ్​ ఎక్స్​పెండిచర్​ సపోర్ట్​(కేర్స్​) కార్యక్రమం ద్వారా 80 కోట్ల మంది ప్రజలకు నేరుగా సాయం చేస్తున్నట్లు ప్రకటించింది. వేల కుటుంబాలు, నిరు పేదలు, రైతులు, ఆరోగ్య కార్యకర్తలు, దివ్యాంగులకు మెరుగైన ఆరోగ్య సదుపాయాలు కల్పించేందుకు వీటిని వినియోగించవచ్చని పేర్కొంది.

20 బిలియన్​ డాలర్లతో కొవిడ్​-19 పాండెమిక్ రెస్పాన్స్ ఆప్షన్​ను(సీపీఆర్​ఓ) కరోనాపై పోరు కోసం ఏప్రిల్​ 13న ఏర్పాటు చేసింది ఏడీబీ. సభ్యదేశాలకు ఆర్థిక సాయం అందించనున్నట్లు ప్రకటించింది. దీని ద్వారానే కేర్స్ కార్యక్రమం నిర్వహిస్తోంది. .

కరోనా నియంత్రణకు భారత్​ చేపట్టిన చర్యలను కొనియాడింది ఏడీబీ. ఆర్థిక ప్యాకేజీ ప్రకటించడం, వైద్య సిబ్బందికి జీవిత బీమా కల్పించడాన్ని ప్రస్తావించింది. ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి భారత్​కు మద్దతుగా ఉంటామని తెలిపింది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.