అదానీ ఎంటర్ప్రైజెస్ నాలుగో త్రైమాసికంలో భారీ లాభాలను ఆర్జించింది. సుమారు 282 శాతం మేర లాభాలను గడించినట్లు తెలిపింది. ఈ మేరకు బుధవారం.. ఫలితాలను విడుదల చేసిన సంస్థ ప్రతినిధులు 2021మార్చి త్రైమాసికంలో రూ. 233.95 కోట్ల ఆదాయాన్ని పొందినట్లు పేర్కొంది.
అదానీ గ్రీన్ లాభం రూ.104 కోట్లు..
అదానీ గ్రీన్ ఎనర్జీ 2020-21 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికానికి గానూ రూ.104 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. అంతకు ముందు ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈ లాభం 86 శాతం ఎక్కువని తెలిపింది. గత ఆర్థిక సంవత్సరంలో ఇదే సమయానికిగానూ కంపెనీ ఏకీకృత నికర లాభం రూ .56 కోట్లుగా ఉన్నట్లు నియంత్రణ సంస్థలకు ఇచ్చిన సమాచారంలో పేర్కొంది.
నష్టాల నుంచి లాభాల్లోకి టాటా స్టీల్...
2021 మార్చితో ముగిసిన చివరి త్రైమాసికంలో టాటా స్టీల్ రూ.7,161.91 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో కంపెనీ రూ .1,615.35 కోట్ల నికర నష్టాన్ని ప్రకటించింది.