ETV Bharat / business

వ్యాక్సిన్‌ రాకతో విహారయాత్రలకు యువత సై

కరోనా మహమ్మారికి టీకా అందుబాటులోకి వచ్చింది. పలు దేశాల్లో సరిహద్దు ఆంక్షలు కూడా తొలగిపోయాయి. ఈ క్రమంలో పర్యటకుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ముఖ్యంగా యువత ఈ వేసవిలో విదేశాల్లో విహరించేందుకు సిద్ధమవుతున్నారని ఓ సర్వే తెలిపింది.

52% millennials keen on international holiday this summer: Survey
వ్యాక్సిన్‌ రాకతో విహారయాత్రలకు సై అంటున్న యువత
author img

By

Published : Feb 7, 2021, 10:46 AM IST

ఏడాదిక్రితం ఇదే సమయంలో కరోనా భయాలు ప్రపంచాన్ని చుట్టుముట్టడం ప్రారంభమైంది. దేశాలు సరిహద్దులను మూసేయడంతో ప్రయాణాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. మార్చి తర్వాత లాక్‌డౌన్‌ ఆంక్షల విధింపుతో ప్రజలంతా ఇళ్లకు పరిమితమయ్యారు. వేసవి వచ్చినట్లు తెలియకుండానే అలా వచ్చి ఇలా వెళ్లిపోయింది. ఏడాది కూడా గడిచిపోయింది. మళ్లీ వేసవి రాబోతోంది. కొవిడ్‌-19 టీకా రావడంతో మళ్లీ ప్రజల్లో పర్యాటక ఆశలు చిగురిస్తున్నాయి. కరోనా భయాలు తగ్గడం, దేశాలు పర్యాటక ఆంక్షలను క్రమక్రమంగా తొలగిస్తుండటం ఇందుకు కారణం. ముఖ్యంగా యువతలో చాలా మంది ఈ వేసవిలో విదేశాల్లో విహరించేందుకు సిద్ధమవుతున్నారని బాట్‌ ట్రావెట్‌ సెంటిమెంట్‌ ట్రాకర్‌ సర్వేలో వెల్లడైంది. ఆన్‌లైన్‌ ద్వారా ఈ ఏడాది జనవరిలో సర్వేను నిర్వహించారు. ఇందులో 6,000 మంది యువత పాల్గొని తమ అభిప్రాయాలను వెల్లడించారు. సర్వేలో వెల్లడించిన అంశాలు పర్యాటక రంగంలో ఉత్సాహన్ని నింపేలా ఉన్నాయని పరిశ్రమ సంతోషం వ్యక్తం చేయడం గమనార్హం. 'ప్రయాణమంటే అటు నుంచి ఇటు.. ఇటు నుంచి అటు రావాలి. భారత్‌ తన సరిహద్దు ద్వారాలను తెరిచే అంశాన్ని త్వరలోనే పరిశీలిస్తుందని అనుకుంటున్నాము. ఇతర దేశాలు కూడా ఈ దిశగా నిర్ణయాలు తీసుకుంటాయని ఆశిస్తున్నాం' అని ట్రావెల్‌ ఏజెంట్‌ అసోసియేషన్స్‌ ఆఫ్‌ ఇండియా ప్రెసిడెంట్‌, ఫెడరేషన్‌ ఆఫ్‌ అసోసియేషన్స్‌ ఇన్‌ ఇండియన్‌ టూరిజం అండ్‌ హాస్పిటాలిటీ వైస్‌ ఛైర్‌పర్సన్‌ జ్యోతి మాయల్‌ అన్నారు. సర్వే ముఖ్యాంశాలు ఇలా.

  • వేసవిలో విదేశాల్లో పర్యటించేందుకు ఆత్రుతతో ఎదురుచూస్తున్నామని 52 శాతం మంది వెల్లడించారు.
  • కొవిడ్‌ కేసుల సంఖ్య తక్కువగా ఉన్న విదేశీ పర్యాటక ప్రాంతాలకు వెళ్తామని 75 శాతం మంది తెలిపారు. అనవసరమైన ఇబ్బందులు ఎదురుకాకుండా ఉండేందుకు కరోనా మహమ్మారి నియంత్రణకు నిర్దేశించిన ఆంక్షలను దృష్టిలో ఉంచుకొని ఆయా దేశాలను ఎంచుకుంటామని వెల్లడించారు.
  • స్వల్ప దూర విదేశీ ప్రాంతాల విభాగంలో థాయ్‌లాండ్‌కు వెళ్లేందుకు అత్యధికంగా 62 శాతం మంది యువత ఆసక్తి చూపింది. ఆ తర్వాతి స్థానంలో సింగపూర్‌ ఉంది. ఇక్కడకు వెళ్లాలని 58 శాతం మంది అనుకుంటున్నారు. యూఏఈని 52% మంది, మాల్దీవులను 46% మంది, సౌదీ అరేబియాను 40 శాతం మంది తమ ఎంపిక చేసుకున్నారు. మలేసియా, ఇండోనేషియా (39% మంది), శ్రీలంక (36%), భూటాన్‌ (31%), టర్కీ (28%) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
  • ఎక్కువ దూర విదేశీ పర్యాటక ప్రాంతాల విషయానికొస్తే అత్యధిక మంది (53%) ఫ్రాన్స్‌ వైపు మొగ్గు చూపారు. జర్మనీకి వెళ్లేందుకు 51% మంది ఆసక్తి చూపగా.. ఆస్ట్రేలియాను 50% మంది, స్విట్జర్లాండ్‌ను 49% మంది, యూఎస్‌ఏను 46% మంది ఎంపిక చేసుకున్నారు. బ్రిటన్‌లో విహరించేందుకు 45% మంది, కెనడా పర్యటనకు 44% మంది, జపాన్‌ను చుట్టొస్తామని 38% మంది చెప్పారు.
  • వేసవిలో విదేశీ పర్యటనల నిమిత్తం రూ.2-5 లక్షలు ఖర్చు పెడతామని 40 శాతం మంది వెల్లడించారు. 35% మంది రూ.5-10 లక్షలకు పెట్టేందుకు సిద్ధమవుతున్నారు.
  • విలాసవంత హోటళ్లను బుకింగ్‌ చేసుకునేందుకు 34 శాతం మంది ఆసక్తి చూపుతుండగా.. బడ్జెట్‌ హోటళ్లకు 25% మంది ఓటేశారు.
  • రద్దీ తక్కువగా ఉండే ప్రాంతాలు, దేశాల్లో పర్యటించేందుకే ఇప్పటికీ పర్యాటకులు ఆసక్తి చూపుతుండటం విశేషం.

ఇదీ చూడండి: సగటు జీవికి పెట్రో సెగ- ఇప్పట్లో ధరలు తగ్గేనా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.