ETV Bharat / business

పబ్లిక్‌ ఇష్యూల్లో 50 శాతం ఓఎఫ్‌ఎస్‌వే! - ఓఎఫ్​ఎస్​

2020లో 43 కంపెనీలు పబ్లిక్‌ ఇష్యూకి వచ్చి 409 కోట్ల డాలర్లను (సుమారు రూ.30,000 కోట్లు) సమీకరించాయి. ఆ జోరు అక్కడితో ఆగిపోకుండా.. ప్రస్తుత సంవత్సరంలోనూ కొనసాగింది. ఇప్పటికే దాదాపు 40 కంపెనీలు తమ పబ్లిక్‌ ఇష్యూలను పూర్తి చేసుకున్నాయి. ఈ ఏడాది ఐపీఓల ద్వారా సమీకరించిన మొత్తం నిధుల్లో సగానికి పైగా ప్రమోటర్లు లేదా అప్పటికే ఉన్న వాటాదార్లు లేదా సంస్థాగత మదుపర్లు ఆఫర్‌ ఫర్‌ సేల్‌ (ఓఎఫ్‌ఎస్‌) ద్వారా షేర్లను విక్రయించగా వచ్చినవే.

50 percent of public issues are for OFS
ప్రమోటర్లకే సగం నిధులు
author img

By

Published : Sep 14, 2021, 7:51 AM IST

పబ్లిక్‌ ఇష్యూలు హోరెత్తిస్తున్నాయి. 2020 రెండో అర్ధభాగంలో మొదలైన ఐపీఓల సందడి కొనసాగుతోంది. చాలా ఐపీఓలకు మదుపర్ల నుంచి విశేష స్పందన రావడమే కాకుండా.. ఎక్స్ఛేంజీల్లో నమోదు అనంతరమూ షేర్లు రాణిస్తున్నాయి. పబ్లిక్‌ ఇష్యూ ధర కంటే తక్కువగా నమోదవుతున్న కంపెనీల షేర్లు కొన్నే కావడం గమనార్హం. ఆసక్తికర విశేషమేమిటంటే.. ఈ మధ్యకాలంలో వచ్చిన ఐపీఓల్లో సగం వరకు ఆయా కంపెనీల ప్రమోటర్లు తమ వాటాలు తగ్గించుకునేందుకు ఉపయోగ పడ్డాయి. ఆఫర్‌ ఫర్‌ సేల్‌ (ఓఎఫ్‌ఎస్‌) రూపంలో జరిగిన ఇష్యూల్లో నిధులు ప్రమోటర్లకే వెళ్తాయి కాని కంపెనీలకు కాదు.

2020లో 43 కంపెనీలు పబ్లిక్‌ ఇష్యూకి వచ్చి 409 కోట్ల డాలర్లను (సుమారు రూ.30,000 కోట్లు) సమీకరించాయి. ఆ జోరు అక్కడితో ఆగిపోకుండా.. ప్రస్తుత సంవత్సరంలోనూ కొనసాగింది. ఇప్పటికే దాదాపు 40 కంపెనీలు తమ పబ్లిక్‌ ఇష్యూలను పూర్తి చేసుకున్నాయి. ఈ ఏడాది ఐపీఓల ద్వారా సమీకరించిన మొత్తం నిధుల్లో సగానికి పైగా ప్రమోటర్లు లేదా అప్పటికే ఉన్న వాటాదార్లు లేదా సంస్థాగత మదుపర్లు ఆఫర్‌ ఫర్‌ సేల్‌ (ఓఎఫ్‌ఎస్‌) ద్వారా షేర్లను విక్రయించగా వచ్చినవే. ఎక్స్ఛేంజీల వద్ద లభ్యమవుతున్న సమాచారం ప్రకారం.. 2020 ఆగస్టు నుంచి 2021 జులై మధ్య రూ.71,932 కోట్ల నిధులను ఆయా కంపెనీలు సమీకరించినట్లు ఓ ఆంగ్లపత్రిక కథనం వెల్లడించింది. ఇందులో ఆఫర్‌ ఫర్‌ సేల్‌లో షేర్ల విక్రయం ద్వారా వచ్చిన నిధులు 52 శాతం వరకు ఉంటాయి. ఐపీఓల్లో చిన్న మదుపర్లు ఊహించని స్థాయిలో పాల్గొంటుండగా, ప్రమోటర్లు కంపెనీల్లో వాటా తగ్గించుకునేందుకు ఐపీఓలను ఉపయోగించుకుంటుండటం గమనార్హం.

అప్పుడు ఆలోచించాల్సిందే..

ప్రమోటర్లు కంపెనీలో తమ వాటా తగ్గించుకుంటున్నంత మాత్రాన.. ఆ కంపెనీకి ఏదో జరిగిపోతుందనే భావనకు రానక్కర్లేదని విశ్లేషకులు చెబుతున్నారు. మార్కెట్లో ఉన్న సానుకూల పరిస్థితులను ఉపయోగించుకుని, సొమ్ము చేసుకునేందుకే ప్రమోటర్లు వాటాలను విక్రయిస్తున్నారని భావించవచ్చని అంటున్నారు. స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో షేర్ల నమోదు తర్వాత కూడా ప్రమోటర్లు తమ వాటాలను విక్రయించడాన్ని కొనసాగిస్తే మాత్రం.. అప్పుడు దానిని ఆలోచించదగ్గ విషయంగా పరిగణించాలని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రమోటర్ల వాటా కంపెనీలో 35-40% కంటే కిందకు వచ్చినప్పుడు.. దానికి గల కారణాలపై ప్రమోటర్లు, యాజమాన్యం స్పష్టమైన వివరణ ఇవ్వనప్పుడు, ఆ కంపెనీకి ఏదో ముప్పు పొంచి ఉందనే ఆలోచనకు రావొచ్చని అంటున్నారు.

ఆలోచించాకే నిర్ణయం..

స్టాక్‌ మార్కెట్లో సానుకూల పరిస్థితులు కలిసిరావడంతో ఈ ఏడాదిలో ఇప్పటి వరకు వచ్చిన పబ్లిక్‌ ఇష్యూల్లో చాలా వాటికి మదుపర్ల నుంచి విశేష స్పందన లభించింది. ఒక ఇష్యూకు దరఖాస్తు చేసుకునే ముందు చిన్న మదుపర్లు చాలా జాగ్రత్తగా వ్యవహరించడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ‘ప్రమోటర్లు గణనీయ స్థాయిలో వాటా తగ్గించుకుంటున్నప్పుడు.. దానికి గల కారణమేంటో తెలుసుకున్నాకే, ఆ ఇష్యూకు దరఖాస్తు చేసుకోవాలో, వద్దో నిర్ణయించుకోవాలి. ఆ కంపెనీ ఆర్థిక మూలాలు, ఆ రంగంలో ఉన్న వృద్ధి అవకాశాలపై ఓ అవగాహనకు రావాలి. అప్పుడే ఆ ఇష్యూకు దరఖాస్తు చేసుకోవాల’ని సలహా ఇస్తున్నారు.

ఇదీ చదవండి: లోన్​ ఇస్తామంటూ ఫోన్ చేస్తున్నారా? ఇవి తెలుసుకోండి..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.