ETV Bharat / business

బీపీసీఎల్‌ కొనుగోలుకు మూడు బిడ్లు - BPCL bids news updates

భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్‌ నియంత్రణ స్థాయి వాటాల కొనుగోలుకు మూడు బిడ్లు వచ్చాయని ఇంధన శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ పేర్కొన్నారు. మైనింగ్‌ దిగ్గజం వేదాంతా 52.98శాతం ప్రభుత్వవాటాల కొనుగోలుకు ఈఓఐను వెల్లడించగా.. రెండు గ్లోబల్‌ ఫండ్స్‌ సంస్థలూ బిడ్లు దాఖలు చేసినట్లు ఆయన తెలిపారు.

3 bids for BPCL, says Oil Minister Dharmendra Pradhan
బీపీసీఎల్‌ కొనుగోలుకు మూడు బిడ్లు
author img

By

Published : Dec 2, 2020, 10:21 PM IST

భారత్‌లోని రెండో అతిపెద్ద ఇంధన సంస్థ భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్‌ నియంత్రణ స్థాయి వాటాల కొనుగోలుకు మూడు బిడ్లు వచ్చాయి. ఈ విషయాన్ని ఇంధనశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ పేర్కొన్నారు. ఇప్పటికే మైనింగ్‌ దిగ్గజం వేదాంతా 52.98శాతం ప్రభుత్వవాటాల కొనుగోలుకు నవంబర్‌ 18న ఈఓఐను వెల్లడించింది. మిగిలిన రెండు గ్లోబల్‌ ఫండ్స్‌ సంస్థలు.

"అక్కడ చాలా సంస్థలు ఆసక్తి చూపుతున్నాయి. డీఐపీఏఎం(డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అండ్‌ పబ్లిక్‌ అసెట్‌ మానేజ్‌మెంట్‌) ఇప్పటికే మార్కెట్‌కు తెలియజేసింది. మూడు సంస్థలు దీని కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నాయి. బిడ్డింగ్‌ ప్రాసెస్‌లో ఈఓఐలు వ్యక్తం చేశాయి" అని ఇంధన శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వెల్లడించారు. ఆయన స్వరాజ్య పత్రిక నిర్వహించిన 'ది రోడ్‌ టూ ఆత్మనిర్భర్‌ భారత్‌' వెబినార్‌లో మాట్లాడిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఎక్స్‌ప్రెషన్‌ ఆఫ్‌ ఇంట్రెస్ట్‌ వెల్లడించిన వాటిలో అపోలో గ్లోబెల్‌ మేనేజ్‌మెంట్‌ కూడా ఉన్నట్లు సమాచారం.

ఇదీ చూడండి: 'భారత్​ గ్యాస్' వినియోగదారులకు ​సబ్సిడీ రాదా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.