ETV Bharat / business

2019:వాహన విక్రయాలకు అత్యంత గడ్డుకాలం - వాహన రంగం ఎదుర్కొంటున్న కష్టాలు

వాహన విక్రయాలు 2019లో రికార్డు స్థాయిలో క్షీణించినట్లు పరిశ్రమల విభాగం 'సియామ్​' వెల్లడించింది. ఏడాది మొత్తం మీద 2019లో అన్ని రకాల వాహనాల విక్రయాలు 13.77 శాతం తగ్గినట్లు సియామ్ పేర్కొంది.

siam
సియామ్
author img

By

Published : Jan 11, 2020, 4:44 AM IST

Updated : Jan 11, 2020, 7:43 AM IST

గత రెండు దశాబ్దాల్లో ఎన్నడూ లేనంతగా 2019లో వాహన రంగం భారీగా క్షీణతను చవిచూసింది. వినియోగదారుల్లో బలహీన సెంటిమెంట్​, గ్రామీణ ప్రాంతాల నుంచి తగ్గిన డిమాండ్​, ఆర్థిక వృద్ధి మందగమనం వంటి పరిస్థితులు వాహన రంగానికి ప్రతికూలంగా మారినట్లు సొసైటీ ఆఫ్​ ఆటోమోబైల్ మానుఫాక్చరర్స్​ (సియామ్​) తెలిపింది.

సియామ్​ వెల్లడించిన గణాంకాల ప్రకారం.. అన్ని కేటగిరీల్లో కలిపి గతేడాది 2,30,73,438 వాహనాలు అమ్ముడైనట్లు తెలిసింది. అయితే 2018లో 2,67,58,787 యూనిట్లు విక్రయమవడం గమనార్హం. 2018తో పోలిస్తే వాహన విక్రయాలు 2019లో 13.77 శాతం తగ్గినట్లు సియామ్​ వెల్లడించింది.

నెల, ఏడాది ప్రాతిపాదికన వాహన విక్రయాల గణాంకాలను నమోదు చేయడం ప్రారంభించినప్పటి (1997) నుంచి ఈ స్థాయిలో అమ్మకాలు క్షీణించడం ఇదే ప్రథమం. గతంలో చూస్తే 2007లో వాహన విక్రయాలు అత్యధికంగా 1.44 శాతం క్షీణించాయని సియామ్​ పేర్కొంది.

కేటగిరీల వారీగా క్షీణత ఇలా..

వినియోగదారుల వాహనాలు 2019లో అంతకు ముందు ఏడాదితో పోలిస్తే 12.75 శాతం క్షీణించి 29,62,052 యూనిట్లు విక్రయమయ్యాయి. 2018లో ప్యాసింజర్​ వాహనాల అమ్మకాలు 33,94,790 యూనిట్లుగా ఉన్నాయి.

ద్విచక్రవాహనాల అమ్మకాలు గతేడాది 1,85,68,280 యూనిట్లుగా ఉన్నాయి. 2018 మొత్తం మీద 2,16,40,033 ద్విచక్ర వాహనాలు విక్రయమయ్యాయి. ఈ లెక్కన 2018తో పోలిస్తే 2019లో ద్విచక్రవాహనాల విక్రయాలు 14.19 శాతం క్షీణించినట్లు తెలుస్తోంది.

వాణిజ్య వాహనాల విక్రయాలు 2018లో 10,05,502 యూనిట్లుగా ఉండగా.. 2019లో 8,54,759 యూనిట్లకు పరిమితమయ్యాయి.

గడ్డుకాలం కొనసాగొచ్చు..

ప్రభుత్వం వివిధ ప్రోత్సాహక చర్యలు చేపడుతున్నప్పటికీ వాహన పరిశ్రమకు సవాళ్లు కొనసాగుతాయని సియామ్‌ అధ్యక్షుడు రాజన్‌ వధేరా అంటున్నారు. బీఎస్‌-6 ఉద్గార నిబంధనలకు మారాల్సి ఉండటం కారణంగా మున్ముందూ పరిస్థితులు ఆశాజనకంగా లేవని తెలిపారు.

గత ఏడాది డిసెంబర్​లో..

2019 డిసెంబర్​లో దేశీయ ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు 1.24 శాతం తగ్గి 2,35,786 యూనిట్లుగా నమోదయ్యాయి. 2018 డిసెంబర్​లో ఈ సంఖ్య 2,38,753 యూనిట్లుగా ఉంది.

గత ఏడాది చివరి నెలలో ప్యాసింజర్​ వాహనాలు అమ్మకాలు 8.4 శాతం క్షీణతతో 1,22,784 యూనిట్లకు పరిమితమయ్యాయి. అంతకు ముందు ఏడాదిలో 1,55,159 యూనిట్ల విక్రయాలు నమోదుకావడం గమనార్హం.

ఇదీ చూడండి:కొచ్చర్​ దంపతులకు ఈడీ షాక్​.. ఆస్తుల అటాచ్

Intro:Body:

blank

Conclusion:
Last Updated : Jan 11, 2020, 7:43 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.