2000 Rupee note in circulation: దేశీయంగా చెలామణీలో ఉన్న మొత్తం కరెన్సీ నోట్లలో రూ.2000 నోట్ల వాటా నవంబరులో 1.75 శాతానికి పడిపోయింది. 2000 రూపాయల నోట్లు 223.30 కోట్ల సంఖ్యలో ప్రస్తుతం చెలామణీలో ఉన్నాయి. విలువ పరంగా వీటి వాటా 15.11 శాతానికి పరిమితమైంది. 2018 మార్చిలో 2000 రూపాయల నోట్లు 336.3 కోట్ల మేర (మొత్తం నోట్లలో 3.27 శాతం) చెలామణిలో ఉండగా, విలువ పరంగా 37.26 శాతానికి సమానంగా ఉండేది. ఈ సమాచారాన్ని రాజ్యసభలో ఆర్థిక సహాయ మంత్రి పంకజ్ చౌదరి పేర్కొన్నారు.
2000 Currency circulation India:
'ఆర్‌బీఐతో చర్చించి ఏ నోట్లు ఎన్ని ముద్రించాలన్నది ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ప్రజలు నిర్వహించే లావాదేవీల గిరాకీకి తగ్గట్లు అవి ఉంటాయ'ని ఆయన తెలిపారు. 2018-19 తర్వాత రూ.2000 నోట్లను ముద్రించకపోవడం, కొన్ని నోట్లు చిరిగి/పనికిరానందున చెలామణీ నుంచి తొలగించడం ఇందుకు కారణాలు.
ప్రభుత్వ రంగ బ్యాంకుల రికవరీ రూ.4.18 లక్షల కోట్లు
గత మూడు ఆర్థిక సంవత్సరాల్లో మోసాలు, ఎగవేతలకు సంబంధించిన రూ.4.18 లక్షల కోట్లకు పైగా మొత్తాన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు రికవరీ చేశాయని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్ కరాడ్ రాజ్యసభకు తెలిపారు. ఇదే సమయంలో రూ.లక్ష లేదా అంతకంటే ఎక్కువ మొత్తంలో జరిగే మోసాలు తగ్గాయని తెలిపారు. ఎగవేతదారుల నుంచి బకాయిలు రాబట్టడానికి ప్రభుత్వం పలు చర్యలు తీసుకున్నట్లు వివరించారు.
ఇదీ చదవండి: రుణ భారతం.. కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలపై పెరిగిన భారం