మేక్ ఇన్ ఇండియా పథకంలో భాగంగా దేశీయ ఉత్పత్తి రంగాన్ని ప్రోత్సహించేందుకు పలు వస్తువులపై దిగుమతి సుంకాలు పెంచుతున్నట్లు ప్రకటించారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. విదేశీ వస్తువులపై ఎక్కువగా ఆధారపడకుండా దేశీయంగా ఉత్పత్తిని పెంచేందుకు కీలక నిర్ణయాలు తీసుకున్నామని తెలిపారు.
బంగారం దిగుమతులపై కస్టమ్స్ సుంకం 10 నుంచి 12.50 శాతానికి పెంచుతున్నట్లు వెల్లడించారు నిర్మల.
పెట్రోల్, డీజిల్‌పై అదనపు వడ్డింపు..
ప్రపంచవ్యాప్తంగా ముడిచమురు ధరలు తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో పెట్రో ఉత్పత్తుల ధరలు మరింత తగ్గే అవకాశాలు ఉన్నాయన్నారు ఆర్థిక మంత్రి. ఈ మేరకు డీజిల్, పెట్రోల్‌పై లీటర్‌కు రూపాయి అదనపు సుంకం విధిస్తున్నామని తెలిపారు.