ఇప్పటికే ఆకాశాన్నంటిన ఇంధర ధరలను బడ్జెట్ మరో మెట్టు పైకెక్కించింది. ఇంధనాలపై ఎక్సైజ్ సుంకం, రహదారి, మౌలిక సదుపాయాల సెస్ విధిస్తున్నట్లు బడ్జెట్లో ప్రకటించారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఫలితంగా లీటర్కు రూ.2 చొప్పున పెరుగనున్నాయి. ఆయా రాష్ట్రాల్లోని పన్నులతో కలిపి ఈ పెరుగుదల మరింత ఎక్కువగా ఉంటుంది.
దిల్లీలోని స్థానిక అమ్మకపు పన్ను, కేంద్ర ఎక్సైజ్ డ్యూటీ కలిపి ఈ మొత్తం రూ.2.5 చేరుకుంటుంది. తెలుగు రాష్ట్రాల్లో వ్యాట్ 33 శాతానికి మించి ఉంది. ఫలితంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో ఈ పెరుగుదల ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఈ పెంపుతో దేశవ్యాప్తంగా ప్రజలపై రూ.28 వేల కోట్లు అదనపు భారం పడనుంది.
అంతేకాకుండా టన్ను ముడి చమురుపై రూ.1 దిగుమతి సుంకాన్ని పెంచింది. దేశంలో ఏటా రూ.220 మిలియన్ టన్నుల ముడిచమురు దిగుమతి చేసుకుంటోంది భారత్. ఫలితంగా రూ.22 వేల కోట్ల అదనపు ఆదాయం ప్రభుత్వానికి లభించనుంది.
ఇదీ చూడండి: బడ్జెట్ 2019: ఈ వస్తువులు మరింత ప్రియం