దేశంలోని రైతులందరికీ సాగు నీటితో పాటు ప్రతి పౌరుడికి తాగునీరును అందించడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమన్నారు నిర్మలా సీతారామన్. జల జీవన్ మిషన్ ద్వారా 2024 నాటికి దేశవ్యాప్తంగా ప్రతి ఇంటికి తాగునీరందిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి లోక్‌సభకు నివేదించారు. వాననీటి సంరక్షణతో పాటు, ఇళ్ల నుంచి వచ్చే మురుగునీటిని శుద్ధి చేసి తిరిగి సాగు యోగ్యంగా మలిచేందుకు ప్రత్యేక పథకాన్ని తేనున్నట్లు సీతారామన్ ప్రకటించారు.
జలవనరుల సాధికారత కోసం జల్‌శక్తి విభాగం ఏర్పాటు చేయనున్నట్లు స్పష్టం చేశారు. జల్‌శక్తి మంత్రాలయ్ ద్వారా జలవనరుల్లోని అన్ని విభాగాలను ఏకీకృతం చేస్తామన్నారు.