టీమ్ఇండియా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ సామాజిక మాధ్యమాల్లో భారత క్రికెటర్లకు ఓ సరికొత్త సవాలు విసిరాడు. 'KeepItUp' అనే ఛాలెంజ్‌ను ప్రారంభించి దీన్ని కొనసాగించండి అంటూ పలువురిని నామినేట్ చేశాడు. అందులో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ తెందూల్కర్, రోహిత్ శర్మ, హర్భజన్ సింగ్‌తో పాటు యునైటెడ్ నేషన్స్, నటి దియా మీర్జా ఉన్నారు.
ఈ వీడియోలో యువరాజ్.. బ్యాట్‌తో బంతిని కొడుతూ ఇదే విధంగా తాను నామినేట్ చేసిన వారు వీడియో తీసి పోస్ట్ చేయాలని కోరాడు. ఈ ఛాలెంజ్‌కు #KeepItUP అనే హ్యాష్‌ట్యాగ్‌ను జోడించాడు. ఇటీవలే రోహిత్‌శర్మ, యువరాజ్ సింగ్ లైవ్ సెషన్లో ముచ్చటించారు. ఆ సందర్భంగా వారిద్దరూ తమ జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు.
-
In these challenging times, I am committed to staying at home to prevent the spread of #Covid19 and will #KeepItUp as long as it is required.
— yuvraj singh (@YUVSTRONG12) May 14, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
I further nominate master blaster @sachin_rt hit man @ImRo45 and turbanator @harbhajan_singh @UN @deespeak pic.twitter.com/20OmrHt9zv
">In these challenging times, I am committed to staying at home to prevent the spread of #Covid19 and will #KeepItUp as long as it is required.
— yuvraj singh (@YUVSTRONG12) May 14, 2020
I further nominate master blaster @sachin_rt hit man @ImRo45 and turbanator @harbhajan_singh @UN @deespeak pic.twitter.com/20OmrHt9zvIn these challenging times, I am committed to staying at home to prevent the spread of #Covid19 and will #KeepItUp as long as it is required.
— yuvraj singh (@YUVSTRONG12) May 14, 2020
I further nominate master blaster @sachin_rt hit man @ImRo45 and turbanator @harbhajan_singh @UN @deespeak pic.twitter.com/20OmrHt9zv
'యువీ నా ఫెవరేట్'
భారత జట్టులోకి వచ్చినప్పుడు యువరాజ్ తన ఫేవరెట్ క్రికెటర్ అని రోహిత్‌శర్మ అన్నాడు. యువీతో మాట్లాడాలని, అతను ఎలా ఆడతాడో.. ఏమి చేస్తాడో చూడాలనిపించేదని ఆ సందర్భంగా వెల్లడించాడు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో సచిన్ తెందూల్కర్, హర్భజన్ సింగ్, యువరాజ్ సింగ్, రోహిత్ శర్మలు కలిసి గతంలో ముంబయి ఇండియన్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించారు.
ఇదీ చూడండి.. కేంద్రం అనుమతిస్తే క్రికెటర్లకు శిక్షణ: ధుమాల్