నవ్యాంధ్రప్రదేశ్ రెండో ముఖ్యమంత్రిగా జగన్మోహన్రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా హైదరాబాద్ కోఠిలోని ప్రగతి మహావిశ్వవిద్యాలయంలో సంబురాలు చేసుకున్నారు. 1991-94లో జగన్తో పాటు విద్యనభ్యసించిన స్నేహితులు, కళాశాల అధ్యాపకులు కేకు కత్తిరించి, టపాసులు పేల్చి ఉత్సవాలు జరుపుకున్నారు. భారీ స్క్రీన్ ఏర్పాటు చేసిన కళాశాల యాజమాన్యం... జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తుండగా చప్పట్లు కొడుతూ ఆనందం వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి : మోదీ కొత్త జట్టులో అవకాశం వీరికే..!