ETV Bharat / briefs

యాదాద్రి పేరు విశిష్టత ఇదే..! - యాదాద్రి ఆలయం

పేరులో ఏముందని తేలిగ్గా తీసిపారేయకండి. పేరుమార్పుతో దశదిశలూ మారుమోగేలా ప్రఖ్యాతి చెందుతుందేమో... సరిగ్గా అదే జరిగింది తెలంగాణ గడ్డపై విలసిల్లుతున్న ఘనమైన క్షేత్రం విషయంలో. అదే యాదగిరిగుట్ట. ఈ యాదగిరిగుట్ట... యాదాద్రి అని పేరు మారగానే ఆ క్షేత్ర ఖ్యాతి ఎల్లలు దాటింది. తెలంగాణ ప్రభుత్వం ఆశించింది ఇదే.

yadadri
author img

By

Published : Jun 15, 2019, 6:04 AM IST

Updated : Jun 15, 2019, 5:27 PM IST

యాదాద్రి ఆలయంపై ప్రత్యేక కథనం

దేశం నలుమూలలా అనేక ప్రసిద్ధమైన క్షేత్రాలున్నాయి. వారణాసి, మధుర, ప్రయాగ, కంచి, తిరుమల, మహానంది, వరంగల్‌ వేయిస్తంభాల ఆలయం, తిరువనంతపురం, పూరీ, కోణార్క్​, శ్రీరంగం, తంజావూరు వంటి క్షేత్రాలెన్నో ఉన్నాయి. అంతటి స్థాయిలో తెలంగాణ గడ్డపై వెలుగొందుతున్న యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామివారి ఆలయాన్ని కూడా తీర్చిదిద్దాలని తెలంగాణ ప్రభుత్వం ఆశిస్తోంది.

అందుకు తగ్గ ప్రణాళికలు వేసింది. అందులో భాగంగా త్రిదండి చినజీయరు స్వామి వారి మేధ తోడయ్యింది. ముఖ్యమంత్రి తో పాటుగా గగనమార్గాన పర్యటించి ఇది గుట్టమాత్రమే కాదు... యాదాద్రి అని పలికారు. తొమ్మిది కొండలున్న నవగిరి క్షేత్రమని ప్రకటించారు. ఉగ్ర, భేరుండ, జ్వాలా, యోగానంద, లక్ష్మీనరసింహ ఈ ఐదు రూపాల పంచనారసింహ క్షేత్రం యాదాద్రి మహాక్షేత్రమై ఈ లోకం కనుల వాకిట సాకారం కాబోతోంది.

ఇదీ చూడండి: 2000 కోట్లు.... ఏడు గోపురాలు... 55 అడుగులు

నిలువెత్తు హైందవ ధర్మం... మానవరూపాన నడయాడే ఆముష్మిక యోగి, ఒక వేద గురువు, ఉపదేశకుడు, శ్రీవైష్ణవ ప్రముఖుడు అయిన చిన్న జీయర్ స్వామి... తెలంగాణ సర్కారు తలపెట్టిన బృహత్కార్యానికి దార్శినికుడయ్యారు. వారి నోటివెంట వెలువడిన యాదాద్రి అనే పదం... ఘనమైన క్షేత్రస్థాయి గుర్తింపుని పేరు మార్పుతోనే ఇచ్చింది. యాదగిరి అనే పదంలో గిరి అంటే పర్వతం, కొండ అని ఉండగా గుట్ట అని మళ్లీ పునరుక్తి ఎందుకనే మీమాంసకు తెరవేసింది. అందుకే యాద అద్రి యాదమహర్షి నివసించిన కొండగా యాదాద్రి అని నూతన నామకరణం విన్నూత్న హోదాను తెచ్చిపెట్టింది.

యాదాద్రి ప్రాజెక్టు నమూనా 2 వేల కోట్ల వ్యయంతో 14 ఎకరాల విస్తీర్ణం కలిగిన యాదమహర్షి కొండపై 2.33 ఎకరాల్లో ఓ భవ్యమైన నిర్మాణమై నిలుచుంటోంది. ఆలయ నిర్మాణానికే 8 వందల 50 కోట్లు. 2వేల ఎకరాల భూసేకరణ. నలువైపులా నాలుగు రాజగోపురాలు, ఏడంతరువుల పశ్చిమ రాజగోపురం అంతరాలయ ప్రవేశ రాజగోపురంతో సప్త రాజగోపురాలు రూపుదాల్చుతున్నాయి. నలువైపులా మాడ వీధులు, వైష్ణవ ఆచార్యులైన ఆళ్వారుల మండపాల నిర్మాణాలతో... భువిపై వెలిసే మరో వైచిత్రి... యాదాద్రి … నమూనా పటంలోని గీతలే విరాట్‌నిర్మాణరూపం సంతరించుకుంటోంది.

ఇదీ చూడండి: యాదాద్రి వైభవం... త్వరలో ఆవిష్కృతం

Intro:Body:Conclusion:
Last Updated : Jun 15, 2019, 5:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.