సికింద్రాబాద్ కార్ఖాన పోలీసు స్టేషన్ పరిధిలో ఓ గృహిణి అదృశ్యమైంది. ఈ నెల 8న ప్రియాంక శర్మ అనే మహిళ బయటకు వెళ్లి తిరిగి రాలేదు. మిత్రులు, బంధువుల వద్ద ఆరా తీసిన ఎలాంటి సమాచారం అందలేదని ఆమె భర్త తునివర్మ తెలిపాడు. అయితే ఆమె ఇన్స్టాగ్రామ్ నుంచి తాను కర్నూల్లో ఉన్నానని.. భర్తను వదిలి పెట్టి తప్పు చేశానని.. తనను కాపాడాలని మెసేజ్ పంపినట్లు పేర్కొన్నాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు కర్నూల్లోని పలు ప్రాంతాలు, బస్స్టేషన్లలో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
ఇవీ చూడండి: కర్నూలులో ప్రమాదం... రాష్ట్రానికి చెందిన 15 మంది మృతి