బిహార్ మోతీహారీ గ్రామంలోని తపాలా ఆఫీసు ఎదుట గ్రామస్థులు పడిగాపులు కాస్తున్నారు. ప్రధాని మోదీ ప్రతీ ఖాతాలోను 25 వేల నుంచి 15 లక్షల వరకు జమ చేస్తున్నారని వార్త రావడమే దీనికి కారణం. అసలే పేదరికం. ఇక ఇలాంటి వార్త వినిపిస్తే జనం ఊరుకుంటారా.. వెనకా ముందూ ఆలోచించకుండా ఆగమేఘాలపై తపాలా బ్యాంకు ఖాతాలు తెరవడానికి తపాలా కార్యాలయానికి ఉరకలు పెడుతున్నారు.
ఊహాగానాలను నమ్మి...
తపాలా కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున ప్రజలు బారులు తీరారు. ఖాతా తెరవడానికి గ్రామస్థులు పోటీపడుతున్నారు.
గ్రామస్థుడు: డబ్బులు పంపడానికి ఖాతాలు తెరవమని మోదీ చెప్పారు.
ప్ర: అందుకే మీరు ఇక్కడికి వచ్చారా?
స:- అవును అందుకే వచ్చాము.
ప్ర: ఎంత సొమ్ము పంపుతామని అన్నారు?
స:- 25వేలు అని అంటున్నారు.
చిన్నారులను భుజాలపై మోస్తూ మరీ క్యూలైన్లో కుస్తీపడుతున్నారు. ఇలాంటి ప్రచారం ఇటీవల సామాజిక మాధ్యమాల్లో సర్వసాధారణమైపోయింది.