లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతివ్వనున్నట్లు ప్రకటించింది ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఓబీసీ పార్టీ మహాన్ దళ్. రాష్ట్ర కాంగ్రెస్ తూర్పు, పశ్చిమ కార్యదర్శులు ప్రియాంకగాంధీ, సింధియాల సమక్షంలో తమ నిర్ణయం వెలువరించింది.
"మహాన్ దళ్ అధినేత కేశవ్దేవ్ మౌర్యకు స్వాగతం. ఐక్యతతో ఎన్నికలను ఎదుర్కొందాం. అన్ని వర్గాలను కలుపుకుని వెళ్లాలన్నది రాహుల్ గాంధీ ఆకాంక్ష."-ప్రియాంక గాంధీ
''కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ఎస్సీలు, బహుజనుల సంక్షేమం కోసం కృషి చేస్తుంది. అన్ని వర్గాల అభివృద్ధి కోసం పనిచేసే పార్టీ కాంగ్రెస్'' అని కితాబిచ్చారు కేశవ్దేవ్ మౌర్య.
2009, 2014 ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మద్దతిచ్చిన మహాన్‌దళ్ 2017 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్రంగా పోటీ చేసింది. పశ్చిమ యూపీలోని ఓబీసీకి చెందిన శాక్య, మౌర్య, కుశ్వాహా కులాల్లో మహాన్ దళ్‌కు మంచి పట్టుంది.