వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ బెయిల్ పిటిషన్‌పై లండన్‌లోని రాయల్ కోర్టు తీర్పును రేపటికి వాయిదా వేసింది. ఉదయం 10 గంటలకు నిర్ణయం వెలువరించనుంది రాయల్స్ కోర్ట్ ఆఫ్ జస్టిస్. నీరవ్ తరఫున న్యాయవాది క్లేర్ మోంటిగొమేరి వాదనలు వినిపించారు.
"భారత ప్రభుత్వం ఆరోపిస్తున్నట్లుగా ఆయన కుట్రపూరిత నేరస్వభావం కలవారు కాదు. ఆయన కేవలం ఓ ఆభరణాల డిజైనర్, వజ్రాల వ్యాపారి. నిజాయతీ, నమ్మకస్తుడైన వ్యక్తి. ఏ దేశానికి చెందిన రాయబార కార్యాలయంలో ఉండాలని నీరవ్ కోరుకోవడం లేదు."
-క్లేర్ మోంటిగొమేరి, కోర్టులో నీరవ్ మోదీ లాయర్ వాదన
నీరవ్ మోదీ సోదరుడు నిహాల్ మోదీ ఎక్కడున్నారని న్యాయమూర్తి ఇన్‌గ్రిడ్ సిమ్లెర్ ప్రశ్నించారు. కేసుతో సంబంధమున్న జెత్వా ఆచూకీపై ఆరా తీశారు. నీరవ్ అకస్మాత్తుగా లండన్‌కు రాలేదని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. బెయిల్ పూచీకత్తును 5 లక్షల పౌండ్లుగా ప్రారంభించారు నీరవ్. ప్రస్తుతం అది 2 మిలియన్ పౌండ్లకు పెరిగింది.
ప్రస్తుతం నీరవ్ తరఫున వాదించే లాయర్లందరూ పెద్దస్థాయి వారని, భారత్‌కు అప్పగించేందుకు వ్యతిరేకంగా వాదించేందుకు సిద్ధమవుతున్నారని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. ప్రస్తుతం నీరవ్ భారత్‌కు వెళ్లడాన్ని తప్పించుకునే అవకాశముందన్నారు.
తిరిగి సరెండర్ కారేమోనన్న అనుమానంతో గతంలో మూడుసార్లు వెస్ట్ మినిస్టర్ కోర్టు నీరవ్ బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించింది. పంజాబ్ నేషనల్ బ్యాంకులో రూ. 13 వేల కోట్ల కుంభకోణానికి పాల్పడి నీరవ్, మెహుల్ చోక్సీలు భారత్ వదలి లండన్‌కు పరారయ్యారు.