పోడు వ్యవసాయం చేసుకునే గిరిజనులను అక్కడి నుంచి పంపించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ఆచార్య కోదండరాం ఆందోళన వ్యక్తం చేశారు. పోడు భూముల జోలికి రావొద్దంటూ గిరిజనులను అధికారులు బెదిరిస్తున్నారని ఆరోపించారు. ఆదివాసీలకు న్యాయం జరిగే వరకు పోరాడుతామని ఆయన స్పష్టం చేశారు. తమ సమస్యలను చట్టసభల్లో వినిపిస్తారని ఆశించి గెలింపిచిన ఎమ్మెల్యేలు అధికార పార్టీ చెంతకు చేరడం దారుణమన్నారు. రేపు ఏటూరునాగారంలో జరగనున్న సభకు పెద్దఎత్తున ఆదివాసీలు తరలిరావాలని కోరారు.
ఇవీ చూడండి:ర్యాంక్ రాని విద్యార్థులు ఆందోళన చెందొద్దు!