ETV Bharat / briefs

జేఈఈ మెయిన్స్​ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల హవా !! - 5TH RANK FOR KARTHIKEYA

జేఈఈ మెయిన్స్​ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు మెరిశారు. తొలి 10 ర్యాంకుల్లో నలుగురు తెలుగు విద్యార్థులున్నారు. ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాలతో పాటు... జేఈఈ అడ్వాన్స్​డ్  పరీక్ష రాసేందుకు జేఈఈ మెయిన్స్​ ర్యాంకులను పరిగణనలోకి తీసుకుంటారు. మే 3 నుంచి జేఈఈ అడ్వాన్స్​డ్ ​ ఆన్​లైన్​ రిజిస్ట్రేషన్​ ప్రారంభం కాగా... 27న పరీక్ష జరగనుంది.

జేఈఈ ​అడ్వాన్స్​డ్​కు దాదాపు 30 వేల మంది అర్హత
author img

By

Published : Apr 30, 2019, 4:47 AM IST

Updated : Apr 30, 2019, 10:07 AM IST

జేఈఈ మెయిన్స్​​లో తెలుగు విద్యార్థులు మరోసారి సత్తా చాటారు. జాతీయ స్థాయిలో ఓపెన్ కేటగిరీలో మొదటి పది ర్యాంకుల్లో నాలుగింటిని తెలంగాణ, ఏపీ విద్యార్థులు కైవసం చేసుకున్నారు. వంద లోపు ర్యాంకుల్లో సుమారు నలభై సాధించి తెలుగు తేజాలు విజయకేతనం ఎగరవేశారు. ఐఐటీ ప్రవేశాల కోసం నిర్వహించనున్న జేఈఈ ​అడ్వాన్స్​డ్​కు రెండు రాష్ట్రాల నుంచి దాదాపు 30 వేల మంది అర్హత సాధించారు.
కార్తికేయకు ఐదో ర్యాంకు
జేఈఈ ఫలితాల్లో నెల్లూరు జిల్లాకు చెందిన బి.కార్తికేయ ఐదో ర్యాంకు సాధించాడు. సిద్దిపేట జిల్లా పాములపర్తి విద్యార్థి ఎ.సాయికిరణ్​ ఏడో ర్యాంకు... సూర్యాపేటకు చెందిన కె.విశ్వంత్​ ఎనిమిదో ర్యాంకు కైవసం చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్​ విద్యార్థి కొండా రేణు తొమ్మిదో ర్యాంకుతో మెరిశారు. ఓపెన్​ కేటగిరీల్లోని తొలి వంద ర్యాంకుల్లో నలభై శాతం తెలుగు విద్యార్థులే సాధించడం విశేషం.
2 లక్షల 45 వేల మంది అర్హత
దేశవ్యాప్తంగా జేఈఈ అడ్వాన్స్​డ్ పరీక్షకు 2 లక్షల 45 వేల మంది అర్హత సాధించారు. ఓపెన్ కేటగిరీలో 89.75, జనరల్ ఈడబ్ల్యూఎస్​లో 78.21, ఓబీసీలకు 74.31, ఎస్సీలకు 54.01, ఎస్టీలకు 44.33 పర్సంటైల్ ను కటాఫ్​గా ప్రకటించారు. ఈ ఏడాది జేఈఈ మెయిన్స్​ను రెండు సార్లు నిర్వహించారు. జనవరిలో జరిగిన మొదటి విడత జేఈఈ మెయిన్స్​ పరీక్షకు 8 లక్షల 74వేల మంది హాజరుకాగా... ఈనెల 7 నుంచి 12 వరకు నిర్వహించిన రెండో విడత పరీక్షను 8 లక్షల 81వేల మంది విద్యార్థులు రాశారు. రెండింటిలో అత్యుత్తమ పర్సంటైల్ ను పరిగణనలోకి తీసుకొని ర్యాంకులను ఖరారు చేశారు.
మే 3 నుంచి జేఈఈ అడ్వాన్స్​డ్​ రిజిస్ట్రేషన్
జేఈఈ అడ్వాన్స్​డ్ పరీక్షకు మే 3 నుంచి ఆన్​లైన్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ మొదలవుతుంది. దేశంలోని 31 ఎన్ఐటీలు, 20 ట్రిపుల్ ఐటీలు, 18 జీఎఫ్​టీఐల్లో సుమారు 24 వేల బీటెక్ సీట్లు జేఈఈ మెయిన్స్​ ఫలితాల ఆధారంగా భర్తీ చేస్తారు. కటాఫ్ మార్కులు సాధించిన విద్యార్థులకు మే 27న జరగనున్న జేఈఈ అడ్వాన్స్​డ్ పరీక్ష రాసేందుకు అర్హత ఉంటుంది. జేఈఈ అడ్వాన్స్​డ్ ఫలితాల అధారంగా దేశంలోని 23 ఐఐటీ, ఐఎస్ఎంలలోని సుమారు 11వేల ఇంజినీరింగ్ సీట్లు భర్తీ చేస్తారు.

జేఈఈ మెయిన్స్​ ఫలితాల్లో మెరిసిన తెలుగు తేజాలు

ఇవీ చూడండి : జేఈఈ మెయిన్స్​ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా

sample description
Last Updated : Apr 30, 2019, 10:07 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.