ETV Bharat / briefs

32 జడ్పీ స్థానాల్లో జెండా ఎగురవేసిన తెరాస - MPTC

జిల్లా పరిషత్​లను ఏకగ్రీవంగా కైవసం చేసుకునేందుకు తెరాస చేసిన కసరత్తు ఫలించింది. రాష్ట్రంలోని 32 జిల్లాల్లో స్పష్టమైన ఆధిక్యంతో ఏకగ్రీవమై అన్ని జడ్పీ స్థానాలను గెలుచుకొని చరిత్ర సృష్టించింది.

zp-trs
author img

By

Published : Jun 8, 2019, 12:59 PM IST

Updated : Jun 8, 2019, 7:26 PM IST

telangana-all-zp-chairmen-won-trs
32 జడ్పీ స్థానాల్లో జెండా ఎగురవేసిన తెరాస

అత్యధిక మండల పరిషత్​లను కైవసం చేసుకున్న తెలంగాణ రాష్ట్ర సమితి అదే తరహాలో జిల్లా పరిషత్​లను గంపగుత్తగా గెలుచుకుంది. రాష్ట్రంలోని 32 జడ్పీ స్థానాల్లో ఏకగ్రీవంగా ఎన్నికై గులాబీ జెండాను ఎగురవేసింది. వరంగల్ గ్రామీణ జిల్లాకు గండ్ర జ్యోతి, ములుగుకు కుసుమ జగదీష్, జనగామకు సంపత్ రెడ్డి, వరంగల్ అర్బన్ నుంచి మారెపల్లి సుధీర్ కుమార్, జయశంకర్ భూపాలపల్లి నుంచి జక్కు శ్రీహర్షిణి ఎన్నికయ్యారు.

కుమురం భీం ఆసిఫాబాద్ జడ్పీ ఛైర్ పర్సన్ మాజీ ఎమ్మెల్యే కోవ లక్ష్మి, నిర్మల్ జిల్లాకు కె.విజయలక్ష్మి, మంచిర్యాల జిల్లా పరిషత్​కు నల్లాల భాగ్యలక్ష్మి ఎన్నికై గులాబీ జెండాను ఎగురవేశారు. పెద్దపల్లి జిల్లా పరిషత్ ఛైర్మన్​గా మంథని మాజీ ఎమ్మెల్యే పుట్టా మధు, రాజన్న సిరిసిల్ల జిల్లాకు మంజులా రెడ్డి, జగిత్యాల జడ్పీ స్థానానికి దరిశెట్టి లావణ్య విజయం సాధించారు.

నల్గొండ జిల్లా పరిషత్ ఛైర్మన్​గా రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి, యాదాద్రి భువనగిరి జడ్పీ పీఠం మాజీ మంత్రి ఉమా మాధవరెడ్డి కుమారుడు ఎలిమినేటి సందీప్ రెడ్డి, సూర్యాపేట జడ్పీ గుజ్జ దీపికకు దక్కాయి. మహబూబ్​నగర్​లో మాజీ ఎమ్మెల్యే స్వర్ణ సుధాకర్ రెడ్డి, నాగర్ కర్నూలు జిల్లా పరిషత్​కు పద్మవతి, వనపర్తికి లోక్ నాథ్ రెడ్డి, జోగులాంబ గద్వాల జిల్లాకు సరిత ఎంపికయ్యారు.

ఖమ్మం జడ్పీ ఛైర్మన్​గా లింగాల కనకరాజ్, భద్రాద్రి కొత్తగూడం జిల్లా పరిషత్ ఛైర్మన్​గా మాజీ ఎమ్మెల్యే కోరె కనకయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కామారెడ్డి జిల్లా పరిషత్​కు దఫేదార్ శోభ, మెదక్ జడ్పీకి హేమలత గౌడ్, సిద్ధిపేట జిల్లా పరిషత్​కు వేలేటి రోజా విజయం సాధించారు. రంగారెడ్డి జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్​గా తీగల అనిత, వికారాబాద్ జడ్పీ ఛైర్ పర్సన్ సునీత మహేందర్ రెడ్డి, మేడ్చల్ జడ్పీ ఛైర్మన్​గా శరత్ చంద్రారెడ్డి ఎన్నికయ్యారు.

ఇవీ చూడండి: 'భాజపా నుంచి గెలిచి తెరాసకు ఎలా మద్దతిస్తావు...?'

Last Updated : Jun 8, 2019, 7:26 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.