2019 ఐపీఎల్ ఆరంభ మ్యాచ్‌లో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్‌పై చెన్నై సూపర్ కింగ్స్ ఘనవిజయం సాధించింది. ఈరోజు రెండు ఐపీఎల్ మ్యాచ్‌లు జరగనున్నాయి. తొలి మ్యాచ్ కోల్‌కతా నైట్‌రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య జరగనుంది. ఈ రెండు జట్లలోని టాప్ ప్లేయర్స్‌పై ఓ లుక్కేద్దాం.
దినేశ్ కార్తీక్
నైట్‌రైడర్స్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు దినేశ్. మంచి ఫామ్‌లో ఉన్న కార్తీక్.. భారత టీ20 జట్టులో ముఖ్య ఆటగాడు. ఐపీఎల్లో 168 మ్యాచ్‌లు ఆడిన ఈ వికెట్ కీపర్ 3,401 పరుగులు సాధించాడు.
డేవిడ్ వార్నర్
ఈ ఆస్ట్రేలియా ఆటగాడు అద్భుతమైన బ్యాట్స్‌మెన్. బాల్ ట్యాంపరింగ్ వివాదంతో ఏడాది పాటు నిషేధానికి గురయ్యాడు. ఇప్పుడు మళ్లీ బరిలోకి దిగుతున్నాడు. ఐపీఎల్లో 114 మ్యాచ్‌లు ఆడిన వార్నర్ 40.54 సగటుతో 4,014 పరుగులు సాధించాడు. 2016లో ఇతడి నాయకత్వంలో సన్రైజర్స్టైటిల్ గెలుచుకుంది.
సునీల్ నరైన్
ఈ మిస్టరీ స్పిన్నర్ ఆల్‌రౌండ్ ప్రదర్శన చేయగల సమర్థుడు. నైట్‌రైడర్స్ జట్టులో కీలక ఆటగాడిగా పేరొందాడు. బౌలింగ్‌లో అదరగొట్టే నరైన్ బ్యాటింగ్‌లోనూ సత్తా చాటుతున్నాడు. 98 మ్యాచ్ లాడి 112 వికెట్లు తీశాడు.
రషీద్ ఖాన్
ఈ ఆఫ్గాన్ యువ సంచలనం ప్రపంచ అత్యుత్తమ బౌలర్లలో ఒకడు. హైదరాబాద్ జట్టుకు అవసరమైన సమయంలో వెన్నెముకలా నిలుస్తున్నాడు. రషీద్ ఖాన్ ఈ సీజన్లోనూ ఆకట్టుకోవాలని అభిమానులు ఆశిస్తున్నారు.
భువనేశ్వర్ కుమార్
హైదరాబాద్ జట్టులో ప్రధాన పేసర్. మంచి అనుభవం ఉన్న ఆటగాడు. డెత్ ఓవర్లలో మంచి ప్రదర్శన కనబరిచే భువీ ఐపీఎల్ టాప్ ప్లేయర్లలో ఒకడు.