28వ సుల్తాన్ అజ్లాన్ షా కప్‌లో ఆసియా క్రీడల ఛాంపియన్ జపాన్ను భారత పురుషుల హాకీ జట్టు ఢీకొట్టనుంది. మలేషియాలోని ఇపో వేదికగా మార్చి 23 నుంచి జరిగే ఈ టోర్నీకి.. సారథి మన్‌ప్రీత్ సింగ్ ఆధ్వర్యంలోని జట్టు సిద్ధమైంది.
ఆరు జట్ల మధ్య లీగ్, నాకౌట్ పద్ధతిలో జరిగే ఈ టోర్నీలో... భారత్ సహా ఆతిథ్య మలేసియా, ఆసియా క్రీడల ఛాంపియన్ జపాన్, దక్షిణ కొరియా, కెనడా, పోలండ్ దేశాలు పాల్గొంటున్నాయి.
- ఆరంభంలోనే బలమైన ప్రత్యర్థి:
తొలి రోజు మ్యాచ్‌లో జకార్తా ఆసియా క్రీడల విజేత జపాన్‌తో భారత్ ఆడనుంది. గతంలో జపాన్-భారత్ ఐదు మ్యాచ్‌ల్లో తలపడితే... ఐదుసార్లు భారత్‌నే విజయం వరించింది. ఈ మ్యాచ్ తర్వాత మార్చి 24న దక్షిణ కొరియాతో, 26వ తేదీన మలేసియాతో, 27న కెనడాతో, 29న పోలాండ్‌తో భారత్ ఆడనుంది.
- గతేడాది మిస్సయింది:
2018 టోర్నీలో భారత్ ఐదో స్థానంతో సరిపెట్టుకుంది. 36 ఏళ్లలో భారత్ ఐదుసార్లు విజేతగా, రెండుసార్లు రన్నరప్‌గా నిలిచింది. ఏడుసార్లు కాంస్యంతోనే సరిపెట్టుకుంది. ఈనెల 30న ఫైనల్ జరుగనుంది.