కొరవడిన పర్యవేక్షణ..
అడ్మిషన్లు పొందిన నాటి నుంచి ధ్రువపత్రాలు పొందే వరకు విద్యార్థుల వద్ద కళాశాల యాజమాన్యం ముక్కు పిండి డబ్బులు వసూలు చేస్తోంది. వారి గైర్హాజరు కళాశాలకు ఆదాయం తెచ్చిపెడుతోంది. కాలేజీలో తరగతులు జరగకున్నా ఎవరూపట్టించుకోవడం లేదు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడింది. యాజమాన్యం ఆడిందే ఆట పాడింది పాట లాగా తయారయింది.
తుప్పుపడుతున్న ప్రయోగపరికరాలు..
600 మంది విద్యార్థులు ఉన్నా... కళాశాల బోసిపోతోంది. ప్రయోగ పరికరాలు తుప్పుపడుతున్నాయి. దశాబ్దం నుంచి ఇదే తంతు కొనసాగుతున్న పట్టించుకొనే నాథుడే లేడు. విద్యార్థుల భవిష్యత్తుప్రశ్నార్థకంగా మారింది. ఉన్నతాధికారులు స్పందించాలని స్థానికులు కోరుతున్నారు.
ఇవీ చూడండి:తెలంగాణ సీజే జస్టిస్ రాధాకృష్ణన్ బదిలీ