అంతర్జాతీయ క్రికెట్ మండలి నూతన చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా మను సాహ్నీ బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం పదవిలో ఉన్న డేవ్ రిచర్డ్‌సన్‌తో కలిసి పనిచేయనున్నారు. వన్డే ప్రపంచకప్ అనంతరం ఆ పదవి నుంచి వైదొలగనున్నారు రిచర్డ్సన్. సాహ్నీ..ఈఎస్పీఎన్ స్టార్‌స్పోర్ట్స్‌కు ఎండీగా పనిచేశారు.
సాహ్నీ నియామకాన్ని ఐసీసీ అపెక్స్ బాడీ ఛైర్మన్ శశాంక్ మనోహర్‌తో పాటు బోర్డు సభ్యులందరూ ఆమోదించారు. ఆయన గత ఆరు వారాలుగా రిచర్డ్‌సన్‌తో కలిసి ప్రయాణిస్తున్నారు.
డేవిడ్ నుంచి బాధ్యతల్ని స్వీకరించినందుకు ఆనందిస్తున్నా. బోర్డులోని సభ్యులతో కలిసి పనిచేసేందుకు ఆత్రుతగా ఎదురు చూస్తున్నా. క్రికెట్‌ను విశ్వవ్యాప్తం చేసేందుకు కృషి చేస్తాను - మను సాహ్నీ
ఐసీసీతో కలిసి 2007-2015 వరకు గ్లోబల్ బ్రాడ్‌కాస్టింగ్ పార్ట్నర్షిప్ బాధ్యతల్ని సాహ్నీ ముందుండి నడిపించారు.