ETV Bharat / briefs

'ఆటలు జీవితంపై నమ్మకం కలిగిస్తాయి' - సానియా మీర్జా తాజా వార్తలు

ఓటములు తట్టుకుని ఎలా నిలవాలన్నది ఆటలు నేర్పించే అత్యంత ముఖ్య విషయమని తెలిపింది భారత టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా. విజయంలో వినయాన్ని, ఓటమిలో నిబ్బరంగా ఉండటాన్ని ఆట నేర్పిస్తుందని వ్యాఖ్యానించింది.

sania
సానియా మీర్జా
author img

By

Published : Apr 7, 2021, 6:48 AM IST

Updated : Apr 7, 2021, 7:14 AM IST

ఇంటర్నేషనల్‌ డే ఆఫ్‌ స్పోర్ట్స్‌ ఫర్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ పీస్‌ సందర్భంగా పార్లమెంటరీ రీసెర్చ్‌ అండ్‌ ట్రెయినింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ డెమోక్రసీస్‌ నిర్వహించిన వర్చువల్‌ ప్యానెల్‌ చర్చలో సానియాతో పాటు టీటీ ఆటగాడు శరత్‌ కమల్‌, ఆర్చర్‌ అభిషేక్‌ వర్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన సానియా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

ఓటములను తట్టుకుని ఎలా నిలవాలన్నది ఆట నేర్పించే అత్యంత ముఖ్య విషయమని సానియా మీర్జా చెప్పింది. "పరాజయం నుంచి ఎలా తేరుకోవాలో, అథఃపాతాళం నుంచి పైకి ఎలా లేవాలో ఆట నేర్పిస్తుంది. ఎలాంటి స్థితిలోనూ ఆశలు వదులుకోకుండా ఉండేలా స్ఫూర్తినిస్తుంది. జీవితంపై నమ్మకం కలిగిస్తుంది" అని ఆమె తెలిపింది.

విజయంలో వినయాన్ని, ఓటమిలో నిబ్బరంగా ఉండడాన్ని ఆట నేర్పిస్తుందని సానియా పేర్కొంది. క్రీడల్లో అన్ని వర్గాల ప్రజలకు అవకాశాలు లభిస్తాయని అంది. చిన్న పట్టణాలు, గ్రామాలు, అన్ని సామాజిక నేపథ్యాల నుంచి వచ్చిన వారు ప్రపంచంలో మేటి ఆటగాళ్లతో పోటీపడేందుకు ఐపీఎల్‌ వేదికగా నిలుస్తోందని సానియా వ్యాఖ్యానించింది. బ్యాడ్మింటన్‌ లీగ్‌, కబడ్డీ లీగ్‌, హాకీ లీగ్‌లు కూడా ఇలాంటి అవకాశాలు కల్పిస్తున్నాయని ఆమె చెప్పింది.

Last Updated : Apr 7, 2021, 7:14 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.