గుజ్జర్లు, రాయిక-రేబరీ, గడియ లుహార్, బంజారా, గడారియా సామాజిక వర్గాలకు 5 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఆందోళనకారులు కోరుతున్నారు.
గుజ్జర్ల ఆందోళనలపై ముఖ్యమంత్రి ఆశోక్ గహ్లోత్ స్పందించారు. కాంగ్రెస్ చర్చలకు సిద్ధంగా ఉందని, శాంతికి భంగం కలిగించరాదని నిరసనకారులకు విన్నవించారు. చర్చల కోసం వైద్యారోగ్య మంత్రి, పర్యటక శాఖ మంత్రి సహా మరికొందరితో కమిటీని ఏర్పాటు చేసినట్లు సమాచారం.