ETV Bharat / briefs

శరవేగంగా ప్రజావేదిక కూల్చివేత... సగానికి పైగా పూర్తి

ప్రజావేదిక కూల్చివేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ నిర్ణయం తీసుకున్న కొద్ది గంటల్లోనే అధికారులు పనులు ప్రారంభించారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో రెండో రోజు సమీక్ష ముగిసిన వెంటనే కూల్చివేత పనులను శరవేగంగా జరుపుతున్నారు.

ప్రజావేదిక కూల్చివేత పనులు
author img

By

Published : Jun 26, 2019, 6:25 AM IST

Updated : Jun 26, 2019, 9:13 AM IST

శరవేగంగా ప్రజావేదిక కూల్చివేత పనులు... సగానికి పైగా పూర్తి

సీఆర్డీఏ ఉన్నతాధికారులు, ఇంజినీర్ల సమక్షంలో ప్రజావేదిక భవన కూల్చివేత ప్రక్రియ కొనసాగుతోంది. వందమంది కూలీలు, జేసీబీలు, ఇతర వాహనాలతో కూల్చివేత పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఫర్నీచర్, ఏసీలు, మైకులు, ఎలక్ట్రానిక్‌ సామగ్రిని నిన్న సాయంత్రమే తరలించారు. భవనంలో ఉన్న సామగ్రిని సచివాలయానికి తరలించారు. అక్కడి పూలకుండీలను హైకోర్టు సమీపంలోని నర్సరీకి పంపించారు. పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. ఇప్పటికే సగానికిపైగా ప్రజావేదిక కూల్చివేత పనులు పూర్తయ్యాయి.

ఎలాంటి సమస్య రాకుండా అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. చంద్రబాబు కూడా విదేశాల నుంచి ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకున్న నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రజావేదిక పరిసరాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఇవీ చూడండి: నూతన అసెంబ్లీ భూమి పూజ కోసం ఏర్పాట్లు

Intro:AP_ONG_84_25_RATION_BIYYAM_AV_C7

ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలం గొల్లపల్లి సమీపం లోని వెంకటేశ్వర స్వామి ఆలయం లో అక్రమంగా నిల్వ ఉంచిన 387 బస్తాల రేషన్ బియ్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తమకొచ్చిన సమాచారం మేరకు పోలీసులు భారీగా ఈ బియ్యాన్ని స్వాధీనం చేసుకొని రెవెన్యూ అధికారులకు అప్పగించారు. గ్రామాల్లోని ఇళ్లల్లో సేకరించి బియ్యం నిల్వ ఉంచినట్లు అధికారులు తెలిపారు. అయితే వీటిని ఎవరు నిల్వ ఉంచారనే దానిపై పోలీసులు విచారణ చేస్తున్నారు.Body:రేషన్ బియ్యం స్వాధీనం.Conclusion:8008019243
Last Updated : Jun 26, 2019, 9:13 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.