ETV Bharat / briefs

54 లక్షల మందికి రైతుబంధు! - FARMERS

రాష్ట్రంలోని రైతులంతా గ్రామస్థాయిలో ఉండే ‘వ్యవసాయ విస్తరణ అధికారికి స్పష్టమైన వివరాలు ఇస్తేనే రైతుబంధు సొమ్ము అందుతుందని వ్యవసాయ శాఖ తాజాగా స్పష్టం చేసింది. వివరాలు అప్‌లోడ్‌ చేస్తేనే పథకం వర్తిస్తుందని  వ్యవసాయ శాఖ కమిషనర్ రాహుల్‌బొజ్జా పేర్కొన్నారు.

54 లక్షల మందికి రైతుబంధు!
author img

By

Published : Jun 9, 2019, 12:24 PM IST

54 లక్షల మందికి రైతుబంధు!

\

రాష్ట్రంలోని 54.60 లక్షల మంది రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలు అందజేసినట్లు రెవెన్యూ శాఖ తెలిపింది. మరికొందరికి పాసు పుస్తకాలు ఇవ్వడానికి తహసీల్దార్లు డిజిటల్‌ సంతకం చేశారని, వీరి బ్యాంకు ఖాతా వివరాలను రైతుబంధు పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేయాలని ఏఈఓలకు ఆదేశాలిచ్చింది.

ఎకరాకు ఐదు వేల రూపాయలు
ఇప్పటివరకు కేవలం 13 లక్షల మంది రైతుల ఖాతాల వివరాలను మాత్రమే ఏఈఓలు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేశారు. వీరిలో 8 లక్షల మంది ఖాతాల్లో వ్యవసాయశాఖ నేరుగా రూ.790 కోట్లను జమచేసింది. గతేడాది 4 లక్షల మంది రైతులు తమ బ్యాంకు ఖాతా వివరాలను ఇవ్వలేదు. ఈసారి కూడా వారి వివరాలు ఇప్పటివరకు అందలేదు. ఫలితంగా గత యాసంగిలో డబ్బు జమ అయిన రైతుల ఖాతాలకే ప్రస్తుతం ఎకరానికి రూ.5 వేల చొప్పున జమ చేస్తున్నామని ఆ శాఖ అధికారులు తెలిపారు. వారితోపాటు కొత్త పాసుపుస్తకాలు అందిన రైతుల వివరాలు కూడా పంపాలని తాజాగా ఏఈఓలను ఆదేశించారు.
ఏఈఓలకు సందేహాలు...
రైతుల వివరాలను అప్‌లోడ్‌ చేసే విషయంలో ఏఈఓలలో స్పష్టత కొరవడిందని, అందుకే వివరాలు వేగంగా ఆన్‌లైన్‌లోకి వెళ్లడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వ్యవసాయశాఖ మార్గదర్శకాల ప్రకారం తొలుత ఏఈఓ రైతుల వివరాలను అప్‌లోడ్‌ చేయాలి. మండల స్థాయిలో ఉండే వ్యవసాయాధికారి(ఏఓ) వాటిని తనిఖీ చేసి ఆమోదించాక ఆన్‌లైన్‌లో నమోదవుతుంది. వాటిని జిల్లా వ్యవసాయాధికారి కార్యాలయంలో ఉండే రైతుబంధు నోడల్‌ అధికారి పరిశీలించి సొమ్ము విడుదల చేస్తారు. ఇలా సొమ్ము విడుదలకు అనుమతించిన రైతుల వివరాలను నోడల్‌ అధికారి తిరిగి ఏఈఓలకు పంపుతారు. మరోసారి బ్యాంకు ఖాతా సంఖ్యలను తనిఖీ చేయాల్సిందిగా సూచిస్తారు. ఇక్కడే గందరగోళం ఏర్పడుతోంది.
ఆన్‌లైన్‌లో పూర్తి వివరాలను అప్‌లోడ్‌ చేయాలి
‘‘గత యాసంగిలో 44 లక్షల మంది రైతులకే రైతుబంధు సొమ్ము బదిలీ అయింది. ఆ తరవాత మరో 10 లక్షల మంది రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు అందినందున వారి వివరాలు ఇప్పుడు ఏఈఓలు అప్‌లోడ్‌ చేయాలి. లేకపోతే వారికి సొమ్ము రాదు. అందుకే అన్నీ వివరాలు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయాలని ఏఈఓలకు తాజాగా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామని వ్యవసాయ కమిషనర్‌ రాహుల్‌బొజ్జా ‘తెలిపారు. రైతుబంధు రాకపోతే ఏఓను సంప్రదించాలని..అక్కడా సమస్య పరిష్కారం కాకపోతే జిల్లా నోడల్‌ అధికారికి ఫిర్యాదు చేయాలని కమిషనర్‌ సూచించారు.

ఇవీ చూడండి : '32 సాధించి కొత్త చరిత్ర సృష్టించాం'

Intro:tg_kmm_07_08_ro_plant_prarambham_ab_c4 ( ) ప్రభుత్వం ఉన్నత పాఠశాల కు దాతలు ఆర్ వో వాటర్ plant ను వితరణ గా ఏర్పాటు చేశారు. లయన్స్ క్లబ్ ఎన్నారై పేరెంట్స్ అసోసియేషన్ ఎస్బిఐ బ్యాంకు సహకారంతో సుమారు లక్ష విలువైన వాటర్ ప్లాంట్ పాఠశాల ఆవరణలో లో ఏర్పాటు చేశారు. సంస్థల ప్రతినిధులు శనివారం సాయంత్రం ఖమ్మం n.s.p. క్యాంప్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల లో ప్రారంభించారు....byte byte.. రఘుపతిలైన్స్ క్లబ్ గవర్నర్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు

Body:పాఠశాలలో ఆరో ప్లాంట్ ఏర్పాటు

Conclusion:పాఠశాలలో వాటర్ ప్లాంట్ ఏర్పాటు
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.