ETV Bharat / briefs

నగరంలో వరుణుడు... వెంటే గాలి...! - rain-at-hyderabad

భానుడి ప్రకోపానికి రాష్ట్రమంతా భగభగలాడిపోతోంటే... భాగ్యనగరంలో మాత్రం వరుణుడి రాకతో ఈ సాయంత్రం వాతావరణం చల్లబడింది. బయటకు వచ్చేందుకే భయపడ్డ నగరవాసులు... వర్షపు జల్లుతో ఉక్కపోత నుంచి ఉపశమనం పొందారు. కానీ... చిన్న వర్షానికే నీళ్లు నిలిచే హైదరాబాద్​ రోడ్లు... ఈదురుగాలులతో కూడిన జల్లుతో రహదారులు చెరువులను తలపిస్తున్నాయి.

చల్లచల్లని వాతావరణం
author img

By

Published : May 21, 2019, 9:36 PM IST

Updated : May 21, 2019, 11:31 PM IST

చల్లచల్లని వాతావరణం
హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో ఈదురుగాలులు, ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది. జీడిమెట్ల, సురారం, దూలపల్లి, చింతల్‌లో చిరుజల్లులు పడగా... కూకట్‌పల్లి, హైటెక్‌సిటీలో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. యూసుఫ్‌గూడ, షేక్‌పేట, రాయదుర్గం, కాప్రా, బోయినపల్లి, హిమయత్‌నగర్‌లోనూ ఓ మోస్తారు వర్షం కురిసింది.

నిలిచిపోయిన విద్యుత్​...

దమ్మాయిగూడ, చర్లపల్లి, కుషాయిగూడ, మల్కాజిగిరి, నాచారం, మల్లాపూర్‌, ముషీరాబాద్‌, కార్వాన్, మేడ్చల్‌లో ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడ్డాయి. ఈదురు గాలుల కారణంగా హయత్‌నగర్‌, పెద్దఅంబర్‌పేట, కొత్తపేట, ఉప్పల్‌, సికింద్రాబాద్, కీసర​లో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. విద్యుత్​ అంతరాయంతో నగరవాసులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రోడ్ల మీద నీరు నిలవటం వల్ల ట్రాఫిక్​కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

హోర్డింగుల వద్ద జాగ్రత్త...

నగరంలో పలు ప్రాంతాల్లో కురిసిన ఈదురుగాలుల వర్షంపై జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ దాన కిశోర్‌ స్పందించారు. విద్యుత్​ అంతరాయం ఏర్పడిన చోట్ల చర్యలు చేపట్టి త్వరితగతిన పునరుద్ధరించాలని అధికారులను ఆదేశించారు. హోర్డింగుల సమీపంలో ప్రయాణించకూడదని నగరవాసులకు దాన కిశోర్‌ సూచించారు.

ఇవీ చూడండి: 15 శాతం వృద్ధిరేటు.. దేశంలోనే అగ్రగామిగా తెలంగాణ

Intro:hyd_tg_60_21_rain_at_nacharam_av_c2
Ganesh_ou campus
( ) హైదరాబాద్ నగరంలో ఒక రాత్రి ఒక సరిగా ఉరుములు మెరుపులు భారీగా ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది గాలికి రోడ్లపై ఉన్న దుమ్ము వాహనదారుల కళ్ళు పడడంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు ఎటు చూసినా ఉరుములు మెరుపులు భారీగా వర్షం పడుతుంది హైదరాబాద్ తార్నాక లాలాపేట ఓయూ క్యాంపస్ నాచారం మల్లాపూర్ హబ్సిగూడా పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది దీంతో వాహనదారులు ఇబ్బందులకు గురయ్యారు కొద్దిసేపు అప్సిగూడ చౌరస్తా తార్నాక జాగ్రత్తలు వాహనాలు రాకపోకలకు ఇబ్బంది కలిగింది...

Body:hyd_tg_60_21_rain_at_nacharam_av_c2

Conclusion:hyd_tg_60_21_rain_at_nacharam_av_c2
Last Updated : May 21, 2019, 11:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.