ఏప్రిల్ ఒకటిన మధ్యాహ్నం 12 గంటలకు జహీరాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో జరిగే ప్రచార సభలో రాహుల్ గాంధీ పాల్గొంటారు. అనంతరం నాగర్ కర్నూల్ పరిధిలోని వనపర్తిలో మధ్యాహ్నం 2 గంటలకు బహిరంగ సభలో ప్రసంగిస్తారు.
సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, లోక్సభ మాజీ స్పీకర్ మీరాకుమార్, మల్లికార్జున ఖర్గేలతోపాటు పలువురు ముఖ్యనేతల ప్రచార కార్యక్రమాల షెడ్యూల్ త్వరలో ఖరారు అవుతుందని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.