ETV Bharat / briefs

అప్పుడు బీడీలు చుట్టారు.. ఇప్పుడు బిస్కెట్లు చేస్తున్నారు

బీడీలు చుట్టే చేతులు ఇప్పుడు బిస్కెట్లు తయారు చేస్తున్నాయి. ఉపాధి పొందటమే కాదు... ఆరోగ్యకరమైన ఆహారాన్ని... చిన్నారులకు ఇష్టమైన పద్ధతిలో అందిస్తున్నారు ఆ మహిళలు. స్వచ్ఛంద సంస్థ ఇచ్చిన ప్రోత్సాహంతో కష్టపడి కలెక్టర్​ చేయూతను అందిపుచ్చుకున్నారు. అంగన్వాడీ కేంద్రాలకు రాగి బిస్కట్లను సరఫరా చేస్తూ... చిన్నారులకు ఆరోగ్యంతోపాటు తల్లిదండ్రులకు ఆనందాన్ని పంచుతున్నారు.

రాగి బిస్కెట్లు
author img

By

Published : May 18, 2019, 5:44 PM IST

రాగి బిస్కెట్ల తయారీ

సిరిసిల్ల శివారులోని కార్మిక క్షేత్రమైన రాజీవ్​నగర్​లో బీడీలు చుట్టడం ఇక్కడి మహిళల ప్రధాన ఉపాధి. బీడీ కార్మికులకు ఆరోగ్యకరమైన ఉపాధి కల్పించాలనే ఆలోచనతో వాసన్ స్వచ్ఛంద సంస్థ ముందుకొచ్చింది. పేద పిల్లలకు పోషకాహారాన్ని అందించాలన్న లక్ష్యంతో... రాగసుధ మహిళా సంఘానికి రూ.లక్షతో బిస్కెట్ల తయారీకి మర యంత్రం, సామాగ్రి అందించింది. వీరి కృషిని అభినందించిన జిల్లా పాలనాధికారి వెంకట్రామిరెడ్డి​... వ్యాపార నిర్వహణకు రూ.లక్ష ఆర్థిక సాయం చేశారు. కలెక్టర్ చేయూతతో రాగి బిస్కెట్లు తయారు చేసి ఉపాధి పొందుతున్నారు.

పిల్లల మనసు దోచుకున్న రాగి బిస్కెట్లు

చిన్నారులకు ఆరోగ్యవంతమైన ఆహారాన్ని బిస్కెట్ల రూపంలో ఇవ్వటం వల్ల ఇష్టంగా తింటున్నారని అంగన్వాడీ నిర్వాహకులు చెబుతున్నారు. ఈ రాగి బిస్కెట్లను ఇంట్లో తయారు చేయటం కష్టమని... ఈవిధంగా అందించటం తమకు సంతోషంగా ఉందని తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ తయారు చేసిన రాగి బిస్కెట్లను సిరిసిల్లలోని 50 అంగన్వాడీ కేంద్రాలోని 714 మంది చిన్నారులకు 2018 ఆగస్టు నుంచి సరఫరా చేస్తున్నారు. ఇటు ఉపాధి, అటు చిన్నారుల్లో ఆరోగ్యాన్ని పెంచటం తమకు సంతృప్తిగా ఉందని మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇవీ చూడండి: అక్షరాలే చిత్రాలైతే... ఆ కళాఖండాలే కథలైతే!

Intro:TG_KRN_61_18_SRCL_RAGI_BISKETS_AVB_PKG_G1_HD

( )మహిళలకు ఉపాధి కల్పించాలని ఓ స్వచ్ఛంద సంస్థ తనవంతు కృషి చేస్తూ పేద పిల్లలకు పోషకాహారాన్ని అందించాలన్న లక్ష్యంతో ముందుకు రాగా వారికి రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డి చేయూతనందించారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్లా పట్టణ శివారులోని కార్మిక క్షేత్రమైన రాజీవ్ నగర్ లో బీడీలు చుట్టడం ఇక్కడి మహిళల ప్రధాన ఉపాధి. వాసన్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో రాజీవ్ నగర్ లోని రాగసుధా మహిళా సంఘానికి లక్ష రూపాయలతో మర యంత్రం, బిస్కెట్లు తయారీకి ఉపయోగించే సామాగ్రి అందించింది. చిరుధాన్యాల కొనుగోలు, వ్యాపార నిర్వహణకు జిల్లా కలెక్టర్ వెంకటరామిరెడ్డి రూ. లక్ష ఆర్థిక సహాయం అందించారు. కలెక్టర్ సాయంతో ఇక్కడి మహిళలు చిరుధాన్యాలతో రాగి బిస్కెట్లు తయారు చేసి ఉపాధి పొందుతున్నారు. ఇక్కడ తయారు చేసిన రాగి బిస్కెట్లను సిరిసిల్ల పట్టణంలోని 50 అంగన్వాడీ కేంద్రాలోని 714 మంది చిన్నారులకు ఆగస్టు నుంచి చిరుధాన్యాలతో తయారు చేసిన రాగి బిస్కెట్లను సరఫరా చేస్తున్నారు.

బైట్: వరలక్ష్మి, రాగి బిస్కెట్లు తయారి నిర్వాహకురాలు సిరిసిల్ల.
బైట్: రాధా ,అంగన్వాడీ ఆయా సిరిసిల్ల.
బైట్: ప్రణీత గృహిణి సిరిసిల్ల.

దేవేందర్ ,ఈ టీవీ, ఈ టీవీ భారత్ సిరిసిల్ల,
రాజన్న సిరిసిల్ల జిల్లా.

Body:srcl

Conclusion:రాజన్న సిరిసిల్ల జిల్లా లో రాగి బిస్కెట్లు తయారు చేస్తూ ఉపాధి పొందుతున్న మహిళలు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.