ఐపీఎల్లో వరుస విజయాలతో దూసుకెళ్తున్న చెన్నైసూపర్కింగ్స్కు బ్రేక్ పడింది. బుధవారం ముంబయితో జరిగిన మ్యాచ్‌లో 37 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. మ్యాచ్ అనంతరం చెన్నై కెప్టెన్ ధోని మాట్లాడుతూ జట్టు ఓటమికి గల కారణాలు వెల్లడించాడు.
10-12 ఓవర్ల వరకు ప్రత్యర్థిని కట్టడి చేశాం. డెత్ ఓవర్లలో మా బౌలర్లు తేలిపోయారు. కొన్ని క్యాచ్‌లు వదిలేయడం, ఫీల్డింగ్‌లో లోపాలు గెలుపు అవకాశాల్ని దెబ్బతీశాయి -ధోని, సీఎస్కే కెప్టెన్
చివర్లో వచ్చిన ముంబయి బ్యాట్స్‌మెన్ హార్దిక్, పొలార్డ్ వీరవిహారం చేశారు. చివరి 2 ఓవర్లలో 45 పరుగులు చేసి.. జట్టు 170 పరుగులు చేయడంలో కీలక పాత్ర పోషించారు.
జట్టు సభ్యుల్ని గాయాలు బాధిస్తున్నాయని ధోని తెలిపాడు.
'బ్రావోను గాయం వేధిస్తోంది. ఎంగిడి ఇప్పటికే సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. రానున్న మ్యాచ్‌ల్లో సరైన కాంబినేషన్లతో ఆడి విజయం సాధిస్తాం' -ధోని, చెన్నై కెప్టెన్
శనివారం సొంతగడ్డపై జరిగే తర్వాతి మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో తలపడనుంది చెన్నై సూపర్ కింగ్స్.
ఇవీ చదవండి: