ETV Bharat / briefs

కారం నీళ్లు కలిపిన చారు భోజనం@రూ.150

కారం నీళ్లు కలిపిన చారు... పప్పే వేయకుండా చేసిన సాంబారు... ఉడకని ఆలుగడ్డల కూర... ఈపాటి భోజనానికి 150 రూపాయల ఖరీదు. ఇదేదో హోటళ్లో అయితే వేరే దగ్గరకి వెళ్లి తినేవాళ్లే. కానీ వెళ్లింది ఓట్ల లెక్కింపు కోసం అయినందున కడుపు మాడ్చుకోలేక వారు పెట్టిందే తినాల్సి వచ్చింది.

కారం నీళ్లు కలిపిన చారు భోజనం@రూ.150
author img

By

Published : Jun 4, 2019, 2:45 PM IST

ఏ మనిషి అయినా రోజూ కష్టపడేది పట్టెడన్నం కోసమే. అలాంటిది ఉదయమే వెళ్లి రోజంతా కష్టపడుతున్న ఓట్ల లెక్కింపు సిబ్బందికి సరైన అన్నం కూడా పెట్టట్లేదు. కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గం కౌంటింగ్ కేంద్రానికి ఉదయం 6 గంటల వరకే చేరుకున్న సిబ్బందికి కనీసం టీ, టిఫిన్ కూడా అందించలేరు. పోనీలే మధ్యాహ్నమైనా ఆకలి తీర్చుకుందాం అనుకుంటే నిరాశే ఎదురైంది. ఎంతో ఆకలితో వచ్చిన వారికి నీళ్ల లాంటి కూర, కారం నీళ్లు కలిపి పోసినట్లుగా ఉన్న సాంబారే దిక్కైంది. ఇవన్నీ చూసిన సిబ్బంది భోజనం సరిగా లేదంటూ నిరసన వ్యక్తం చేశారు.

కడుపు మాడ్చుకోలేక కొందరు సిబ్బంది నీళ్ల చారు, ఉడకని ఆలుగడ్డ కూరనే తిన్నారు. అసలు ఇలాంటి భోజనాన్ని ఎవరూ తినరని, తామిప్పుడు ఆకలికి ఆగలేకనే తింటున్నట్లు తెలిపారు.

ఓట్ల లెక్కింపులో పాల్గొన్న ప్రతీ ఒక్కరికి భోజనం కోసం రూ.150 కేటాయిస్తున్నప్పటికీ... ఈ రకంగా ఉండటం గమనార్హం.

కారం నీళ్లు కలిపిన చారు భోజనం@రూ.150

ఇవీ చూడండి: చంటిపిల్లలతో లెక్కింపు కేంద్రాల వద్ద తల్లుల తిప్పలు

Intro:filename:

tg_adb_05_04_bojanam_sariga_ledantu_ennikala_sibbandi_nirasana_avb_c11

Body:కుమురం భీం జిల్లా సిర్పూర్ టి నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన పరిషత్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కేంద్రంలో భోజనం సరిగా లేదంటూ సిబ్బంది నిరసన వ్యక్తం చేశారు. ఉదయం పూట అల్పహారం కూడా సరిగా లేదని తెలిపారు. నీళ్ల చారు, ఉడకని అలుగడ్డ కూరలు చేసారని ఆహారం ఈ విదంగా ఉంటే ఎలా తినాలని ప్రశ్నించారు. భోజనం కోసం ఒక వ్యక్తికి 150 రూపాయలు కేటాయిస్తున్నారని అయిన కానీ వంటలు ఈ విధంగా ఉన్నాయని విమర్శించారు.

బైట్:
లెక్కింపు సిబ్బంది
రామచందర్

Conclusion:KIRAN KUMAR
SIRPUR KAGAZNAGAR
KIT. 641

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.