ETV Bharat / briefs

బంగ్లాదేశ్​లో భారీ పేలుడు- ఏడుగురు మృతి - బంగ్లాదేశ్​ వార్తలు

బంగ్లాదేశ్‌ రాజధానిలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందగా.. 50 మంది గాయపడ్డారని పోలీసులు తెలిపారు. పేలుడు ధాటికి భవనాలు సహా ఓ బస్సుత ధ్వంసమైనట్లు చెప్పారు.

Bangladesh
బంగ్లాదేశ్​
author img

By

Published : Jun 28, 2021, 3:25 AM IST

Updated : Jun 28, 2021, 4:23 AM IST

బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందారు. మరో 50 మంది గాయపడ్డారు. మొగ్ బజార్ వైర్ లేస్ గేట్ వద్ద ఆదివారం రాత్రి 8 గంటలకు పేలుడు సంభవించినట్లు అధికారులు తెలిపారు. పేలుడు ధాటికి ఏడు భవనాలు, ఓ బస్సు తీవ్రంగా ధ్వంసమైనట్లు చెప్పారు.

స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు.. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. వారిలో 10 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు పేర్కొన్నారు. అయితే పేలుడుకు తక్షణ కారణాలు తెలియవని చెప్పారు. గ్యాస్‌ సిలిండర్‌ పేలడమే ఈ దుర్ఘటన జరిగినట్లు ప్రాథమికంగా ఓ అంచనాకు వచ్చినట్లు ఢాకా పోలీస్‌ కమిషనర్ షఫీకుల్ ఇస్లాం తెలిపారు. పేలుడు తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల ఉగ్రకోణంలోనూ దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. ఘటనా స్థలిలో సహాయక చర్యలు కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు.

ఇదీ చూడండి: అగ్నిపర్వతం బద్దలు.. బూడిదతో ఇక్కట్లు

Last Updated : Jun 28, 2021, 4:23 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.