ఎలిజబెత్ రాణి, ప్రిన్స్ ఫిలిప్ ఎలిజబెత్ రాణి, ప్రిన్స్ ఫిలిప్బ్రిటన్ రాణి ఎలిజబెత్-2 భర్త ప్రిన్స్ ఫిలిప్ తన డ్రైవింగ్ లైసెన్స్‌ను పరిత్యజించారు. జనవరిలో ఫిలిప్ ప్రయాణిస్తున్న ల్యాండ్ రోవర్ కారు... మరో కారును ఢీకొట్టింది. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ డ్రైవింగ్‌ను వదిలేస్తున్నట్లు ప్రకటించారు 97 ఏడేళ్ల ఎడిన్బర్గ్ రాజు. ఆలస్యంగా స్పందించినందుకు స్థానిక వార్తాపత్రికలు, ఛానెళ్లు ఆయనపై విమర్శలు చేస్తున్నాయి.
"ప్రమాదానికి బాధ్యత వహిస్తూ రాజు ఫిలిప్ డ్రైవింగ్ లైసెన్స్‌ను పోలీసులకు అప్పగించారు." -బకింగ్‌హామ్ ప్యాలెస్
ప్రమాద వివరాలను రాజవంశ దోషవిచారణ(సీపీఎస్) విభాగానికి అందించారు పోలీసులు. ప్రమాద సమయంలో కారు నడిపింది ఎవరనేది పోలీసులు కనిపెట్టాల్సి ఉంది. ఈ విషయంలో ఫిలిప్‌కు శిక్ష పడే అవకాశముందని భావిస్తున్నారు. ప్రమాదం జరిగిన అనంతరం ఫిలిప్ ఆవేదన చెందారని రాజ వంశీయులు తెలిపారు.