తాగునీటి ప్రాజెక్టు పేరుతో సాగునీటి ప్రాజెక్టు పనులు చేస్తున్నారని హర్షవర్ధన్ అనే వ్యక్తి జాతీయ హరిత ట్రైబ్యునల్‌లో పిటిషన్ దాఖలు చేశారు. పనులపై కమిటీ వేసి నివేదిక తెప్పించుకోవాలని అభ్యర్థించారు. గతంలో దాఖలైన వ్యాజ్యంతో పాటు దీన్ని విచారిస్తామని ట్రైబ్యునల్ పేర్కొంది. తదుపరి విచారణ జులై 8కి వాయిదా వేసింది.
తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంపై హయత్ ఉద్దీన్ వేసిన పిటిషన్‌పై ఎన్జీటీ నేడు విచారణ జరిపింది. ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ వ్యాజ్యం దాఖలైంది. ఈరోజు న్యాయవాది హాజరు కాకపోవడం వల్ల విచారణ వాయిదా వేయాలని జాతీయ హరిత ట్రైబ్యునల్‌ను కోరారు హయత్ఉద్దీన్. విచారణను ఎన్జీటీ జులై 10కి వాయిదా వేసింది.
ఇదీ చూడండి : పదో తరగతి ఫలితాల్లో బాలికల ముందంజ