ETV Bharat / briefs

భానుడి ఉగ్రరూపం... బెంబేలెత్తుతున్న జనం

రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు రోజురోజుకు అధికమవుతున్నాయి. భానుడి ఉగ్ర రూపానికి జనం పగటి పూట బయటకు రాలేకపోతున్నారు. వృద్ధులు, పిల్లలు, మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని... ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.

author img

By

Published : May 17, 2019, 5:25 AM IST

Updated : May 17, 2019, 6:53 AM IST

ఉష్ణోగ్రతలు

రాష్ట్రంలో భానుడు ఉగ్రరూపం దాలుస్తున్నాడు. రోజు రోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. పగటి పూట బయటకు రావాలంటేనే జంకుతున్నారు. వాయువ్య భారతం నుంచి పొడి గాలులు వీస్తున్నందున శుక్రవారం నుంచి 3 రోజుల పాటు వడగాలుల ఉద్ధృతి పెరుగుతుందని హైదరాబాద్​ వాతావరణ కేంద్రం అధికారి రాజారావు తెలిపారు. గురువారం అత్యధికంగా జగిత్యాల జిల్లా ధర్మపురిలో 45.2, మేడిపల్లి 45.1, మెట్​పల్లిలో 44.9, రామగుండం 43.6, హైదరాబాద్​లో 41.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని... ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ అధికారులు హెచ్చరించారు.

అధిక ఉష్ణోగ్రతలతో జనం అవస్థలు

ఇదీ చూడండి : 'నర్సారెడ్డితో దీక్ష విరమింపచేసిన ఉత్తమ్'

Intro:రిపోర్టర్ పేరు: ముత్తె వెంకటేష్
సెల్ నంబర్: 9949620369
jk_tg_adb_81_16_matti_namanula_py_avagahana_pkg_c7
రైతులకు చేరువగా భూసార ఫలితం
....ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో జాతీయ సుస్థిర వ్యవసాయ మిషన్ పథకం అమలు
.....మండలానికి ఒక గ్రామం ఎంపిక
మట్టి నమూనాల సేకరణ, భూసార పరీక్ష లు వాటి ఫలితాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. జాతీయ సుస్థిర వ్యవసాయ పథకం కింద ఉమ్మడి జిల్లాలోని ఒక్కో మండలంలో ఒక్కో గ్రామాన్ని ఎంపిక చేశారు. ప్రయోగాత్మకంగా భూసార పరిక్షలు నిర్వహించి వాటి ఫలితాలను రైతులకు అందించేందుకు ప్రణాళిక రూపొందించారు.
*ఉమ్మడి జిల్లా సాధారణ సాగు 5.70 లక్షల హెక్టార్లు కాగా వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఏటా 6 లక్షల హెక్టార్లలో ప్రధాన పంటగా పత్తిని, తర్వాత సొయా, కంది, వరి తదితర పంటలను సాగు చేస్తున్నారు. వీటితో పాటు కూరగాయల సాగు చేస్తున్నారు . భూసార పరీక్షల ఫలితాల ఆధారంగా ఎరువులు వినియోగించుకోవడం వల్ల ఆశించిన దిగుబడులు వచ్చే అవకాశముంది.
*భూసార పరీక్షల ప్రాధాన్యం గుర్తించి న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి రైతుకు తమ భూమికి సంబంధించిన భూసార పరీక్ష ఫలితాలు అందించాలని భావిస్తున్నాయి. వ్యవసాయ శాఖ ప్రణాళిక రూపొందించింది. ఉమ్మడి జిల్లాలో 70 గ్రామాలను ఎంపిక చేసి ఈ నెల 31 తేదీ లోగా ఫలితాల కార్డులు అందించాలని నిర్ణయించారు. ఇప్పటికే అన్ని గ్రామాల్లో మట్టి నమూనాలు సేకరించారు. 70 వేలకు పైగా మట్టి నమూనాలు తీసుకోవాల్సి ఉంటుంది.
* మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలంలో దుగ్నేపల్లి లో మట్టి నమూనాలను సేకరించారు. ఏడిఏ సురేఖ, ఏ ఓ ప్రేమ్ కుమార్ లు మట్టి నమూనాలు స్వయంగా తీసుకున్నారు. రైతుల నుంచి కూడా మంచి స్పందన లభించిందని వ్యవసాయ అధికారులు తెలిపారు.

Body:బైట్స్
సురేఖ, ఏడిఏ, బెల్లంపల్లి
ప్రేమకుమార్, ఏఓ, బెల్లంపల్లి
సింగతి రవి,రైతు
నారాయణ, రైతు
శ్రీనివాస్, రైతు

Conclusion:బెల్లంపల్లి
Last Updated : May 17, 2019, 6:53 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.