ఏపీ శాసనసభ ఎన్నికల్లో జనసేన ఘోర పరాభవానికి గల కారణాలపై నాలుగు రోజులుగా ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ జిల్లాల వారీగా సమీక్షలు నిర్వహిస్తున్నారు. భవిష్యత్తు కార్యాచరణకు సంబంధించి నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు. దీనిలో భాగంగా ఇవాళ గుంటూరు జిల్లా మంగళగిరిలోని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో రాయలసీమ నేతలతో సమీక్ష నిర్వహించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటేందుకు ఇప్పటినుంచే సమాయత్తం కావాలని పార్టీ శ్రేణులకు పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. రాయలసీమలో అధిక సంఖ్యలో ఓట్లు వచ్చాయని వీటిని కాపాడుకోవాలని సూచించారు. ప్రజల సమస్యలు పరిష్కారానికి జనసేన నాయకులు ముందుండాలని పవన్ దిశానిర్దేశం చేశారు.
ఇదీ చూడండి: ప్రేమ... పెళ్లి... ఫిర్యాదు... అసలేమైంది?