జూనియర్ పంచాయతీ కార్యదర్శుల ఉద్యోగాలకు రెండో మెరిట్ జాబితాను వెంటనే విడుదల చేయాలంటూ అభ్యర్థులు సచివాలయం వద్ద ఆందోళన చేపట్టారు. పంచాయతీ రాజ్ చట్టం 2018 ప్రకారం ప్రతి గ్రామానికి కార్యదర్శి ఉండాలని దానికి అనుగుణంగా ఖాళీగా ఉన్న అన్నీ కొలువులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. 124 జీవోను అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఏ ఒక్క పోస్టును బ్యాక్లాగ్ కింద చూపించొద్దని డిమాండ్ చేశారు. ఆందోళన చేపట్టిన అభ్యర్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఇవీ చూడండి: ప్రగతిభవన్ ముట్టడిని కట్టడి చేసిన పోలీసులు