అసెంబ్లీ ఎన్నికల్లో తెరాస ఇచ్చిన హామీల అమలులో విఫలమైందని తెతెదేపా అధ్యక్షుడు ఎల్.రమణ విమర్శించారు. పార్లమెంట్ ఎన్నికలను ఎదుర్కొనే సత్తా లేకనే డేటా చోరీ కేసును తెరమీదకు తీసుకొచ్చారని ఆరోపించారు. జగన్, మోదీలతో కేసీఆర్ కుమ్మక్కైయ్యారని... శాసన సభ ఎన్నికల్లో తెరాస అనుసరించిన కుట్రలు ఆంధ్రలోనూ అమలు చేసి జగన్ను గద్దెనెక్కించడానికి కేసీఆర్ యత్నిస్తున్నారని ఆక్షేపించారు. ఆంధ్రలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చూడలేకనే సరికొత్త కుట్రలకు కేసీఆర్ తెరతీశారని ఎద్దేవా చేశారు.
ఇవీ చూడండి:కేసీఆర్కు కేటీఆర్ సవాల్