క్రీడల్లో అంతర్జాతీయ స్థాయిలో తమ దేశానికి ప్రాతినిధ్యం వహించడమంటే సాధారణ విషయం కాదు. ప్రతి ప్లేయర్‌కు అలాంటి కల ఉంటుంది. ఛాంపియన్షిప్ లాంటి టోర్నీల్లో దేశం తరఫున పాల్గొనాలని వారు ఎదురుచూస్తుంటారు. అయితే అలాంటి సందర్భం వచ్చినా, సొంత దేశం పేరును వాడుకోకుండా ఉంటే ఎలా ఉంటుంది. ఇలాంటిదే ఓ సంఘటన ఖతార్ వేదికగా జరుగుతోన్న 'ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్'లో చోటు చేసుకుంది.
ఈ టోర్నీలో బరిలోకి దిగిన రష్యన్ పోల్ వాల్టర్ ఏంజెలికా సిదొరోవా స్వర్ణం సాధించింది. ఆదివారం జరిగిన పోటీలో 4.95 మీటర్లు ఎత్తు ఎగిరి పతకం సొంతం చేసుకుంది. అయినా ఆమెకు జాతీయ గౌరవం దక్కలేదు. మెడల్ తీసుకునే సమయంలో కనీసం జాతీయ జెండాతో ఆనందాన్ని పంచుకునే అవకాశం లేకుండా పోయింది.
-
In one of the greatest pole vault competitions in #WorldAthleticsChamps history, Anzhelika Sidorova clears a PB 4.95m to claim 🥇 pic.twitter.com/RxmjlJ2iot
— IAAF (@iaaforg) September 29, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">In one of the greatest pole vault competitions in #WorldAthleticsChamps history, Anzhelika Sidorova clears a PB 4.95m to claim 🥇 pic.twitter.com/RxmjlJ2iot
— IAAF (@iaaforg) September 29, 2019In one of the greatest pole vault competitions in #WorldAthleticsChamps history, Anzhelika Sidorova clears a PB 4.95m to claim 🥇 pic.twitter.com/RxmjlJ2iot
— IAAF (@iaaforg) September 29, 2019
"స్వర్ణం అంటే స్వర్ణమే. పసిడి సాధించినందుకు సంతోషంగా ఉన్నా.. సౌకర్యంగా లేను. అయితే బంగారం సాధిస్తానని అనుకోలేదు"
-ఏంజెలికా సిదొరోవా, రష్యా క్రీడాకారిణి
ఎందుకిలా..?
రష్యన్ అథ్లెట్లపై నాలుగేళ్లుగా డోపింగ్ ఆరోపణలు వస్తున్నాయి. ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ(వాడా).. వారిపై నిషేధాన్ని పెంచుకుంటూ పోతుంది. ప్రస్తుత అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో వీరికి బరిలోకి దిగడానికి అనుమతిచ్చింది. కానీ కొన్ని షరతులు విధించింది. జాతీయ జెండాలను దూరం పెట్టాలనే నిబంధనతో పాటు పతకాలు సాధిస్తే జాతీయ గీతమూ ఆలపించవద్దని స్పష్టం చేసింది. అంటే తటస్థ అథ్లెట్‌గా బరిలో దిగాలన్న మాట.
ఇవీ చూడండి.. కెరీర్ బెస్ట్ ర్యాంక్ సాధించిన సుమిత్ నగల్