18ఏళ్లు.. 26 సినిమాలు.. ఇది టాలీవుడ్ హీరో నితిన్ ట్రాక్ రికార్డ్. 19 ఏళ్లకే 'జయం'తో వెండితెరకు పరిచయమై అభిమానుల 'దిల్'లో స్టార్‌గా క్రేజ్ సంపాదించుకున్నారు. ఆ తర్వాత ఎన్నో అద్భుత చిత్రాలతో మెప్పించారు. అయితే నితిన్ నటనా కెరీర్ ప్రారంభించి జూన్ 14కు 18 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా అతడి సినీ ప్రయాణం గురించి ఆసక్తికర విశేషాలు..
నితిన్ 'జయం'తో టాలీవుడ్‌కు పరిచయమయ్యారు. తేజ దర్శకుడు. ఈ సినిమా ఘన విజయం సాధించడం వల్ల ఇతడికి వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ఆ తర్వాత వరుస హిట్లు అందుకుని, టాలీవుడ్ అగ్రదర్శకులందరితోనూ పనిచేశారు. అయితే ఆ విజయాల పరంపర ఎంతో కాలం కొనసాగలేదు. కె.రాఘవేంద్రరావు, రాజమౌళి వంటి అగ్ర దర్శకులతో పనిచేసిన తర్వాత కెరీర్లో వరుసగా పదికి పైగా ప్లాఫ్లు మూటగట్టుకున్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
'ఇష్క్' తో
కానీ 2012లో వచ్చిన 'ఇష్క్'తో నితిన్ కెరీర్ మళ్లీ ఊపందుకుంది. ఈ చిత్రం ఊహించని రీతిలో సూపర్ హిట్‌గా నిలిచింది. దీంతో ఇతడు తిరిగి విజయాల ట్రాక్‌లోకి వచ్చారు. అనంతరం వచ్చిన 'గుండెజారి గల్లంతయ్యిందే' 'హార్ట్ ఎటాక్' సినిమాతో విజయాల్ని కొనసాగించారు. ఆ తర్వాత నుంచి ఇప్పటివరకు విడుదలైన నితిన్ సినిమాలు.. హిట్లు, మిశ్రమ స్పందనలు అందుకున్నాయి. ఇటీవలే వచ్చిన 'భీష్మ' విశేష ప్రేక్షకాదరణ సొంతం చేసుకుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ప్రతిసారి ఓ కొత్త దర్శకుడుతోనే
18 ఏళ్ల పూర్తి చేసుకున్న నితిన్ కెరీర్లో ఓ ఆసక్తికర విషయం ఉంది. తనను పరిచయం చేసిన తేజతో తప్ప ఇతర ఏ దర్శకుడుతోనూ మరోసారి కలిసి పనిచేయలేదు. ప్రతిసారీ ఓ కొత్త దర్శకులకు అవకాశాలిస్తూ టాలీవుడ్లో ప్రయాణం సాగించారు. అయితే త్వరలో 'పవర్ పేట'తో రెండోసారి.. దర్శకుడ్ని రిపీట్ చేయనున్నారు. ఈ సినిమాకు కృష్ణచైతన్య దర్శకత్వం వహించబోతున్నారు. ఇతడు ఇదివరకే నితిన్‌తో 'ఛల్ మోహన్‌రంగ' తీశారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
టాలీవుడ్ అగ్ర దర్శకులతో
టాలీవుడ్ అగ్ర దర్శకులైన కె.రాఘవేంద్రరావు, పూరీ జగన్నాథ్, త్రివిక్రమ్ శ్రీనివాస్, రాజమౌళి, వి.వి.వినాయక్, రామ్‌గోపాల్ వర్మ, కృష్ణవంశీ లాంటి వారితో కలిసి నితిన్ పనిచేశారు. చిన్న వయసులోనే ఇలా స్టార్ డైరెక్టర్ల సినిమాల్లో నటించిన ఘనత నితిన్‌కు మాత్రమే దక్కింది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదిచూడండి : 'సోనూసూద్ లాంటి వ్యక్తులు చాలా అరుదు'