శాసన మండలికి ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఎన్నికైన సభ్యుల ఇవాళ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. పట్నం మహేందర్ రెడ్డి, పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, తేరా చిన్నపరెడ్డి, నవీన్ రావుతో ఉదయం తొమ్మిదిన్నర గంటలకు శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ నేతి విద్యాసాగర్ ప్రమాణం చేయించనున్నారు. స్థానిక సంస్థ కోటాలో రంగారెడ్డి జిల్లా నుంచి పట్నం మహేందర్ రెడ్డి, వరంగల్ జిల్లా నుంచి పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, నల్గొండ నుంచి చిన్నపరెడ్డి ఎన్నికయ్యారు. శాసనసభ్యుల కోటాలో నవీన్ రావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
ఇదీ చూడండి: ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల కొత్త ఇళ్లకు ముహూర్తం ఖరారు