ETV Bharat / briefs

నీట్​లో ఏడో ర్యాంక్ సాధించిన తెలంగాణ తేజం - neet

వైద్య విద్య ప్రవేశాల కోసం గత నెల 20న నిర్వహించిన నీట్ జాతీయ ర్యాంకులను ఎన్​టీఏ వెల్లడించింది. ఈ ఏడాది కూడా దాదాపు సగం మందే ఉత్తీర్ణత సాధించారు. తెలంగాణ విద్యార్థిని జి.మాధురి రెడ్డి జాతీయ స్థాయిలో ఏడో ర్యాంక్ సాధించి... బాలికల విభాగంలో మొదటి స్థానంలో నిలిచారు. మొదటి యాభై ర్యాంకుల్లో నాలుగింటిని తెలుగు విద్యార్థులు కైవసం చేసుకున్నారు.

neet results 2019
author img

By

Published : Jun 5, 2019, 4:40 PM IST

Updated : Jun 5, 2019, 8:52 PM IST

నీట్​ ఫలితాలు: తెలంగాణ విద్యార్థికి ఏడో ర్యాంకు

వైద్య విద్య ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్​లో 56.27 శాతం ఉత్తీర్ణత నమోదైంది. తెలంగాణ విద్యార్థులు 33 వేల 44 మంది... ఏపీ నుంచి 39 వేల 39 మంది విద్యార్థులు అర్హత సాధించారు. రాజస్థాన్​కు చెందిన నళిన్ ఖండేల్ వాల్ 701 మార్కులతో జాతీయ స్థాయిలో మొదటి ర్యాంకు సాధించారు. తెలంగాణ విద్యార్థిని జి.మాధురి రెడ్డి 695 మార్కులతో జాతీయ స్థాయిలో ఏడో ర్యాంకు సాధించి... బాలికల విభాగంలో మొదటి స్థానంలో నిలిచారు. తొలి యాభై ర్యాంకుల్లో ఏపీ విద్యార్థులు మూడింటిని కైవసం చేసుకున్నారు. విద్యార్థిని ఖురేషి అస్రా 690 మార్కులతో జాతీయ స్థాయిలో 16... బాలికల కేటగిరీలో మూడో స్థానంలో నిలిచారు.

అమ్మాయిలదే పై చేయి

గతేడాదితో పోలిస్తే 14.52 శాతం ఎక్కువగా విద్యార్థులు పరీక్ష రాశారు. దేశవ్యాప్తంగా 15 లక్షల 19 వేల 375 మంది నీట్ రాసేందుకు దరఖాస్తు చేసుకున్నప్పటికీ... 14 లక్షల 10 వేల 755 మంది మాత్రమే పరీక్ష రాశారు. వారిలో కేవలం 56.27 శాతంతో 7 లక్షల 97వేల 42 మంది మాత్రమే అర్హత సాధించారు. ఈసారి కూడా నీట్​లో అమ్మాయిలదే పైచేయి కనిపించింది. అర్హత సాధించిన వారిలో బాలికలు 4 లక్షల 45వేల 761 మంది ఉండగా... అబ్బాయిలు 3 లక్షల 51 వేల 278 మంది ఉన్నారు. అత్యధికంగా రాజస్థాన్ విద్యార్థులు 74.30 శాతం అర్హత సాధించగా... నాగాలాండ్ విద్యార్థులు కేవలం 29.34 శాతం ఉత్తీర్ణులయ్యారు.

తెలుగురాష్ట్రాల్లో పెరిగిన ఉత్తీర్ణత

దేశవ్యాప్తంగా 465 మెడికల్ కాలేజీల్లో 66 వేల 771 ఎంబీబీఎస్ సీట్లు... 309 దంత వైద్య కళాశాలల్లో 27 వేల 148 బీడీఎస్ సీట్లు అందుబాటలో ఉన్నాయి. నీట్​లో తెలుగు రాష్ట్రాల విద్యార్థుల ఉత్తీర్ణత శాతం గతేడాదితో పోలిస్తే స్వల్పంగా పెరిగింది. తెలంగాణ విద్యార్థులు గతేడాది 67.44 శాతం మంది అర్హత సాధించగా... ఈ ఏడాది 68.88 శాతం ఉత్తీర్ణులయ్యారు. తెలంగాణ విద్యార్థులు మొత్తం 33వేల 44 మంది అర్హత సాధించారు. ఆంధ్రప్రదేశ్​లో గతేడాది 70.20శాతం అర్హత సాధించగా... ఈ ఏడాది 72.55 శాతానికి పెరిగింది. ఏపీ విద్యార్థులు 39వేల 39 మంది అర్హత సాధించారు.

ఇరవైలో రెండు మనవే

జాతీయ స్థాయిలో తొలి ఇరవై ర్యాంకుల్లో రెండిటిని... మొదటి యాభై ర్యాంకుల్లో నాలుగింటిని తెలుగు విద్యార్థులు కైవసం చేసుకున్నారు. బాలికల విభాగంలో 1, 3 ర్యాంకుల తెలుగు అమ్మాయిలే సాధించారు. ఏపీకి చెందిన పిల్లి భాను శివతేజ 685 మార్కులతో 40వ ర్యాంకు... ఎస్.శ్రీనందన్ రెడ్డి 685 మార్కులతో 42 వ ర్యాంకును సాధించారు. దిల్లీకి చెందిన భావిక్ బన్సాల్ 700 మార్కులతో రెండో ర్యాంకు... యూపీకి చెందిన అక్షత్ కౌషిక్ 700 మార్కులతో మూడో ర్యాంకు సాధించారు.

ర్యాంకుల ఆధారంగా ప్రవేశాలు

జాతీయ ర్యాంకుల ఆధారంగా అఖిల భారత కోటాలో ప్రవేశాలు నిర్వహించనున్నారు. ఆ తర్వాత రాష్ట్ర స్థాయి ర్యాంకులను తెలంగాణలో కాళోజి నారాయణ రావు ఆరోగ్య విశ్వవిద్యాలయం... ఏపీలో ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం ప్రకటించనుంది. అఖిల భారత కోటా ప్రవేశాలు పూర్తయిన తర్వాత... రాష్ట్ర ర్యాంకుల ఆధారంగా రాష్ట్రంలోని ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాలను ఆయా యూనివర్సిటీలు నిర్వహించనున్నాయి.

ఇదీ చూడండి: ఇంటర్​ సప్లిమెంటరీ పరీక్షలు యథాతథం: అశోక్​

Intro:Body:Conclusion:
Last Updated : Jun 5, 2019, 8:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.