ETV Bharat / briefs

జాతీయ పార్టీలు విఫలం: కేటీఆర్​ - కాంగ్రెస్​

ఇద్దరు ఎంపీలతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించామన్నారు కేటీఆర్​. 16 మంది ఎంపీలను ఇస్తే కేంద్రంపై ఒత్తిడి తెచ్చి అధికంగా నిధులు సాధించే అవకాశం ఉంటుందన్నారు. ప్రజల కనీస అవసరాలను తీర్చడంలో జాతీయ పార్టీలు విఫలమయ్యాయని విమర్శించారు.

16 మంది ఎంపీలను గెలిపించండి
author img

By

Published : Mar 18, 2019, 6:15 PM IST

16 మంది ఎంపీలను గెలిపించండి
స్వాతంత్రం వచ్చి ఇన్నేళ్లయినా జాతీయ పార్టీలు ప్రజల కనీస అవసరాలు తీర్చలేదని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడుకేటీఆర్​ ఆరోపించారు. దేశంలోని చాలా రాష్ట్రాల్లో కాంగ్రెస్​, భాజపాల ఉనికే లేదన్నారు. ప్రాంతీయ పార్టీలు బలంగా లేని చోట మాత్రమే జాతీయ పార్టీలకు ప్రజలు ఓట్లు వేస్తున్నారని తెలిపారు.

కాంగ్రెస్​ ఎమ్మెల్యేలను అడ్డగోలుగా కొంటున్నారని కొందరు అంటున్నారని... వారిలో నాయకత్వ లోపం ఎక్కడ ఉందో ఆత్మ విమర్శ చేసుకోవాలని సూచించారు. 16 మంది ఎంపీలను గెలిపిస్తే కేంద్రంపై ఒత్తిడి తెచ్చి మరిన్ని నిధులు సాధించుకోవచ్చని వివరించారు.

హైదరాబాద్​లో టీపీసీపీ అధికార ప్రతినిధి క్రిశాంక్​ కేటీఆర్​ సమక్షంలోగులాబీ గూటికి చేరారు. అలాగేవికారాబాద్, భూపాలపల్లికి చెందిన కాంగ్రెస్​ నాయకులు తెరాస తీర్థం పుచ్చుకున్నారు.

ఇవీ చూడండి:'నాకెందుకు అపాయింట్​మెంట్​ ఇస్తలేరు'

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.